Singareni: గుడ్ న్యూస్.. వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్న రూ. 1,53,913..!

సింగరేణి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ వేళ సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.1,754 కోట్ల లాభాలు వచ్చాయని భట్టి విక్రమార్క చెప్పారు. లాభాల వాటా పంపిణీ ద్వారా సంస్థ పరిధిలోని సుమారు 38 వేల మంది శాశ్వత కార్మికులకు తలా రూ.1,53,912 మేర బోనస్‌ అందిస్తామని ప్రకటించారు. 30 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.5,500 చొప్పున పంపిణీ చేయనున్నారు.

సంస్థలో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై మంత్రులు స్పందించారు. పెండింగ్‌లో ఉన్న 300 మంది డిపెండెంట్‌ కార్మికుల నియామక పత్రాలను రాబోయే 15 రోజుల్లో అందజేస్తామన వెల్లడించారు. గనుల ప్రాంతంలో కార్మికుల మారుపేర్లకు సంబంధించిన సమస్యను కూడా పక్షం రోజుల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో విధులకు రాలేక ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బంది తిరిగి విధుల్లో చేరేందుకు వన్ టైమ్ ఆప్షన్ కింద అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు. కార్మికులకు శాశ్వత గృహవసతి కల్పించేందుకు మైనింగ్‌ పూర్తయిన ఖాళీ ప్రదేశాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేస్తామన్నారు.

Singareni

నెహ్రూ హౌసింగ్‌ కాలనీ పేరుతో స్థలాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. సింగరేణి ఆసుపత్రులను కార్పొరేట్ ప్రమాణాలతో ఆధునీకరిస్తామని తెలిపారు. ఉద్యోగుల భద్రత కోసం అమలు చేస్తున్న ప్రమాద బీమా కింద శాశ్వత సిబ్బందికి రూ.1.2 కోట్లు, ఒప్పంద సిబ్బందికి రూ.40 లక్షల వరకు ఆర్థిక రక్షణ కల్పిస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. ఇప్పటివరకు సింగరేణిలో 3,189 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. అందులో 2,437 కారుణ్య నియామకాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. సింగరేణి సాధించిన నికర లాభాల్లో 34 శాతాన్ని పర్మినెంట్ కార్మికులకు పంపిణీ చేయాలని యాజమాన్యం నిర్ణయించిందని పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో అర్హులైన ప్రతి పర్మినెంట్ కార్మికుడికి రూ. 1,53,913 వరకు బోనస్ అందనుంది. రాత్రింబవళ్లు గనుల్లో శ్రమిస్తూ సంస్థ అభివృద్ధికి, రాష్ట్ర వెలుగులకు కారణమవుతున్న కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని యాజమాన్యం పేర్కొంది. పండుగకు ముందే ఈ బోనస్ మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+