Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణలో రూ.70 వేల కోట్లతో భారీ డేటా సెంటర్..!
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయి. భారీ డేటా సెంటర్ ప్రాజెక్టును తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొంగరకలాన్ ఫ్యూచర్ సిటీలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం రేవంత్ రెడ్డీ సమక్షంలో సమక్షంలో టీసీఎస్, తెలంగాణ ప్రభుత్వంతో హైపర్ వాల్ట్ ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణను దేశంలోని ప్రముఖ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, బ్లూ కాలర్ ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టాటా గ్రూప్ చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా బ్లూ కాలర్ ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపారు. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో ఓపెన్ ఏఐకు అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా మారబోతుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వన్ గిగావాట్ సామర్థ్యం కలిగిన ఈ డేటా సెంటర్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం జరగబోతుందని ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలు వంటి రంగాల నుంచి భారీగా డిమాండ్ పెరుగుతోందని ఆయన గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో ఇంత పెద్ద డేటా సెంటర్ తెలంగాణలో ఏర్పాటు కావడం రాష్ట్ర డిజిటల్ ఎకానమీకి మరింత బలంగా మారుతుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న 'తెలంగాణ రైజింగ్' పాలసీ, అలాగే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై టాటా సన్స్ చైర్మన్ ఆసక్తి చూపారని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి చేసిన చర్చల తర్వాత టాటా గ్రూప్ ఈ భారీ ప్రాజెక్టుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రస్తుతం టాటా గ్రూప్‌కు చెందిన సంస్థల్లో.. తెలంగాణలోనే సుమారు 83 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ భారీ డేటా సెంటర్ నిర్మాణాన్ని 18 నుంచి 24 నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో రూ.70 వేల కోట్ల పెట్టుబడి రావడం ఒక కీలక మైలురాయి కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రపంచ స్థాయి డేటా సెంటర్ ఏర్పాటు కావడం ద్వారా.. ఫ్యూచర్ సిటీ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని.. ఈ ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని పేర్కొంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, బ్లూ కాలర్ ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టాటా గ్రూప్ చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా బ్లూ కాలర్ ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపారు. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
