Subsidy On Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 50 శాతం రాయితీ..!

పెట్రోల్, డీజిల్ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతుంది. ముఖ్యంగా మహానగరాల్లో గాలి కాలుష్యం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో ఎయిర్ పోల్యూషన్ చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా గోవా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. గోవా ప్రభుత్వం లైసెన్స్ పొందిన బైక్ టాక్సీ, ఆటో డ్రైవర్లు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 50 శాతం వరకు రాయితీ ఇవ్వాలని భావిస్తోంది.
ఆ రాష్ట్ర సుస్థిర రవాణా వ్యూహంపై శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్‌తో నడిచే వాహనాలను ఉపయోగిస్తున్న డ్రైవర్లు.. ఎలక్ట్రిక్ వాహనాలకు మారేలా ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని ప్రభుత్వం అధికారులను గతంలోనే ఆదేశించింది. దీంతో 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కేంద్రం పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద రాష్ట్రంలో 70 కొత్త ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక, వాణిజ్య సంస్థలలో స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని కదంబ రవాణా సంస్థ (KTC) నడుపుతున్న పాత డీజిల్ బస్సులకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ఇంజిన్లను అమరుస్తుంది.

EV

పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, సోలార్ విద్యుత్ వాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు ఉపయోగించే డీజిల్ జనరేటర్ సెట్లను దశలవారీగా మార్చడానికి ఒక విధానాన్ని సిద్ధం చేయాలని సీఎం ప్రమోద్ సావంత్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛమైన ఇంధన వనరులకు సజావుగా మారేలా చూసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇటు తెలంగాణలో కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ట్యాక్స్ క్ట చేశారు.

ఢిల్లీలో 2027 జనవరి 1 నుంచి ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు, ఎన్1 కేటగిరీ గూడ్స్ వాహనాలను మాత్రమే రిజిస్టర్ చేయనున్నారు. 2028 ఏప్రిల్ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ (బైక్స్) మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. దీంతో కొత్త పెట్రోల్, CNGతో నడిచే బైకుల రిజిస్ట్రేషన్ దశలవారీగా నిలిపివేయడం జరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలో ఇప్పటికే డీజిల్ వాహనాలను నిషేధించారు. ఎలక్ట్రిక్ టూవీలర్స్ కొనేవారికి రూ.30 వేల వరకు, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు రూ.50 వేల వరకు, ఎన్1 ఎలక్ట్రిక్ ట్రక్కులకు రూ.1 లక్ష వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+