Bisleri Water: బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అందులో ప్రమాదకర బ్రోమేట్..!
మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కువగా వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తుంటాం. బస్టాండ్లలో చాలా వరకు బ్రాండెడ్ కంటే లోకల్ బ్రాండ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మెయిన్ బ్రాండ్ల పేరులో ఒక అక్షరం తొలంగించి మరో అక్షరం చేర్చుతారు. మనం ఆతృతలో స్పెలింగ్ చూసుకోకుండా బాటిల్ కొనుగోలు చేసి తాగుతాం. అయితే తాజా ఒక మెయిన్ బ్రాండ్ కు సంబంధించి ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. బిస్లరీ వాటర్ సురక్షితం కాదని FSSAI ఆదివారం ప్రకటించింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనా అసురక్షితమని తేలడంతో బిస్లరీ ఇంటర్నేషనల్‌పై విచారణకు అనుమతి మంజూరు చేసినట్లు ఆహార నియంత్రణ సంస్థ FSSAI నవంబర్ 22న ప్రకటన చేసింది.
అసురక్షిత ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై విచారణకు అనుమతి మంజూరు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. విశ్లేషణ కోసం బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రాంగణం నుంచి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (మినరల్ వాటర్ కాకుండా) నియంత్రణ నమూనాను సేకరించారని పేర్కొంది. నిర్ణీత బ్రోమేట్ పరిమితులకు అనుగుణంగా లేదని తేలడంతో FSS చట్టం, 2006 ప్రకారం దీనిని అసురక్షితంగా ప్రకటించామని నియంత్రణ సంస్థ తెలిపింది. కంపెనీ అప్పీల్ మేరకు ఈ నమూనాను రెఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపగా అందులో పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు కనుగొనబడటంతో అది కూడా అసురక్షితంమని ప్రకటించిందని నియంత్రణ సంస్థ వెల్లడించింది.

ల్యాబ్ పరిశోధనలు, చట్టం ప్రకారం అసురక్షిత ఆహారానికి సంబంధించిన ఉల్లంఘనలను నిర్ధారించాయని తెలిపింది. అందువల్ల, బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్ చట్టం, 2006 కింద విచారణ ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రకటించింది. వసంత్ మసాలా ప్రైవేట్ లిమిటెడ్, టిట్-బిట్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మిమాన్సా ఇండస్ట్రీస్ మరియు ఆశా కన్ఫెక్షనరీతో సహా మరికొన్ని కంపెనీలపై కూడా విచారణకు అనుమతి ఇచ్చినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది.
నియమ నిబంధనలను పాటించనందుకు ఊర్మి లైఫ్‌సైన్సెస్ ఎల్‌ఎల్‌పి, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ లైసెన్సులను ఈ నియంత్రణ సంస్థ నిలిపివేసింది. ఆశా కన్ఫెక్షనరీకి వ్యతిరేకంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఉత్పత్తిని వెనక్కి తీసుకోవాలని (ప్రొడక్ట్ రీకాల్) ఆదేశాలు కూడా జారీ చేసింది. ముందుగా ప్యాక్ చేసిన చాక్లెట్ నింపిన కుకీలు సురక్షితం కాదని తేలడంతో వాటిని ఉపసంహరించుకోవాలని ఆ కంపెనీని ఆదేశించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications