Hyderabad: హైదరాబాద్‌లో డిసెంబర్ 10న తొలి యాపిల్ స్టోర్ ప్రారంభం.. ఎక్కడంటే..!
ఇండియాలో ఐ ఫోన్ స్టేటస్ సింబర్ అయిపోయింది. దీంతో చాలా మంది యాపిల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అలాగే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్ యేన్సర్లు కూడా ఐ ఫోన్లు వాడుతున్నారు. దీంతో యాపిల్ కంపెనీ భారత్ పెద్ద మార్కెట్ గా అవతరించింది. అయినప్పటికీ భారత్ లో ఐ ఫోన్ల స్టోర్లు చాలా తక్కువ. ఎక్కువ మంది ఆన్ లైన్ లోనే ఈ ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది విదేశాల నుంచి ఐ ఫోన్లు తెప్పించుకుంటున్నారు. అయితే ఇండియాలో ఐ ఫోన్ స్టోర్లు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. ఇండియాలో ఐ ఫోన్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నా.. కొత్తగా స్టోర్లు ఎందుకు తెరవడం లేదని చాలా మందికి ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యాపిల్ స్టోర్లు లేకపోవడాన్ని చాలా మంది అడుగుతున్నారు. తాజాగా యాపిల్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో కూడా యాపిల్ స్టోర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ స్టోర్ లో కంపెనీకి చెందిన అన్ని రకాల ఉత్పత్తులు, సేవలు లభిస్తాయని ఆ కంపెనీ తెలిపింది. కస్టమర్లకు సాంకేతిక సహకారం అందించడానికి నిపుణులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, బిజినెస్ టీమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయని ఆపిల్ ప్రకటించింది. హైదరాబాద్‌కు పెర్ల్ సిటీగా ఉన్న పేరును ప్రతిబింబించేలా ఈ స్టోర్లోగోను డిజైన్ చేసినట్లు పేర్కొంది. ముత్యం ఆకారంలో ఉండే ఆపిల్ లోగోను స్టోర్ బయట ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది.

హైదరాబాద్‌లో ఇప్పటికే ఆపిల్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్, రిటైల్ కస్టమర్ కేర్ టీమ్స్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తమ భారత్ కార్యకలాపాల్లో ఈ నగరానికి ప్రత్యేక స్థానం ఉందని ఆపిల్ గుర్తు చేసింది. ఫోటోగ్రఫీ, వీడియో క్రియేషన్, డ్రాయింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు టుడే ఎట్ ఆపిల్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తామని తెలిపింది. ఇక్కడ కస్టమర్లు ఉచితంగా శిక్షణ పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఇంతకీ హైదరాబాద్ లో యాపిల్ స్టోర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుసా. కూకట్‌పల్లిలోని లేక్‌షోర్- వైజంక్షన్ మాల్లో ఆపిల్ కూకట్పల్లి పేరుతో ఈ స్టోర్ ఓపెన్ చేయనున్నారు. డిసెంబర్ 10న ఈ స్టోర్ ను ప్రారంభించనున్నట్లు యాపిల్ ప్రకటించింది.
ఇండియాలో ముంబై, ఢిల్లీ-ఎన్ సీఆర్, బెంగళూరు, పూణే నగరాల్లో యాపిల్ రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఫిజికల్ స్టోర్లు, ఆన్లైన్ ఛానెల్స్ ద్వారా కస్టమర్లతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమని యాపిల్ తెలిపింది ప్రారంభోత్సవానికి ముందు హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించేలా డిజిటల్ కంటెంట్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇందులో ప్రత్యేక వాల్ పేపర్లు, స్టిక్కర్లు, మ్యూజిక్ ప్లే లిస్ట్ ఉన్నాయి. డిసెంబర్ 10న సాయంత్రం 5 గంటలకు ఆపిల్ కూకట్పల్లి స్టోర్‌ను వినియోగదారుల కోసం తెరుస్తారని కంపెనీ ప్రకటించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications