పండుగల సీజన్ వచ్చేస్తుంది అంటే షాపింగ్, గిఫ్ట్స్, కొత్త కొత్త వస్తువులు అన్నీ గుర్తొస్తాయి కదా! ఈసారి మాత్రం ఖర్చులు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. దానికి కారణం? జీఎస్టీ రేట్ల తగ్గింపులు అలాగే ప్రజల్లో పెరిగిన పాజిటివ్ మూడ్.
లోకల్ సర్కిల్స్ చేసిన సర్వే చెబుతున్నది ఏమిటంటే 10 మందిలో 6 మంది కనీసం రూ. 5,000 పైగా ఖర్చు చేసేందుకు సిద్ధమై ఉన్నారు. మొత్తం మీద ఈసారి పండుగ ఖర్చులు రూ. 2.19 లక్షల కోట్లకు చేరతాయని అంచనా. ఇది గత ఏడాదితో పోలిస్తే "18% ఎక్కువ".

కరోనా తర్వాత ఆన్‌లైన్ షాపింగ్‌కి ప్రజలు బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడైతే మార్కెట్‌కి వెళ్లి షాపింగ్ చేసేవాళ్లు చాలా తగ్గిపోయారు. తాజా సర్వే ప్రకారం, దాదాపు 28% మంది ఈసారి పండుగల కోసం ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 115% ఎక్కువ. ఎందుకంటే, ఇంటి దగ్గరికి వస్తువులు డెలివరీ అవ్వడం, ఎన్నో వెరైటీలు ఒకే ప్లాట్‌ఫాం మీద దొరకడం, డిస్కౌంట్లు, ఆఫర్లు రావడం, అలాగే ఈజీ రిటర్న్ ఆప్షన్లు ఇలా అన్నీ కలిసి ఆన్‌లైన్ షాపింగ్‌ని మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి. ముఖ్యంగా అర్బన్ ఫ్యామిలీస్‌లో 89% మంది వస్తువుల క్వాలిటీ, ధర, రిటర్న్ గ్యారంటీని ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ పండుగ సీజన్‌లో ఖర్చులు ఎక్కువగా ఏ కేటగిరీల్లోకి వెళ్ళబోతున్నాయో సర్వే క్లియర్‌గా చూపించింది. అందులో టాప్‌లో ఉన్నవి స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్. దాదాపు 44% మంది ఈ విభాగం పైనే ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొత్త ఫోన్లు, టీవీలు, గాడ్జెట్లు కొనడం పండుగలలో ట్రెండ్‌లా మారిపోయింది. అదే స్థాయిలో హోమ్ రీనోవేషన్, డెకరేషన్ కూడా పాపులర్ అవుతోంది. ఇంటిని కొత్తగా అలంకరించుకోవడం, ఫర్నీచర్ మార్చడం, ఇంటీరియర్ అప్‌గ్రేడ్ చేయడం ఇలా అన్నీ ఈ సమయంలోనే ఎక్కువగా చేస్తారు. ఇంకొంత మంది గ్రాసరీస్, ఫ్యాషన్, బ్యూటీ ప్రోడక్ట్స్ మీద దృష్టి పెట్టనున్నారు. పండుగలలో కొత్త బట్టలు, కాస్మెటిక్స్, గిఫ్టింగ్ ఐటమ్స్ ఇలా షాపింగ్ లిస్ట్‌లో ఉండటం సహజమే కదా! మొత్తానికి ఈసారి ఖర్చులు ఒక్క రంగానికే పరిమితం కాకుండా, వివిధ కేటగిరీల్లో విస్తరించబోతున్నాయి.
ఈసారి పండుగ సీజన్‌లో ఖర్చులు పెరగడం వల్ల లాభం కేవలం షాపింగ్ వరకే ఆగిపోదు, అది ఆర్థిక వ్యవస్థకి కూడా బలమైన బూస్ట్ ఇస్తుంది. ఇటీవల అమెరికా టారిఫ్‌ల కారణంగా భారత ఎగుమతులు కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. అలాంటి సమయంలో దేశంలోనే ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తే, ఇంటర్నల్ డిమాండ్ పెరిగి మార్కెట్లకి కొత్త ఊపు వస్తుంది. ఈ డిమాండ్ రీటైల్ నుంచి ఈ-కామర్స్, మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి సర్వీసుల వరకు అనేక రంగాలకు లాభం చేకూరుస్తుంది.
మొత్తం మీద, ఈ పండుగ సీజన్‌లో ప్రజలు "Spend More, Celebrate More" అనే మూడ్‌లోకి వెళ్లిపోతారు. షాపింగ్ మాల్స్, లోకల్ మార్కెట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు అన్నీ కస్టమర్లతో కిక్కిరిసే అవకాశముంది. ఫలితంగా, షాపర్లకు ఆనందం, బిజినెస్‌లకు లాభం, ఆర్థిక వ్యవస్థకి ఊతం ఇవన్నీ కలిపి ఈ సీజన్‌ని మరింత స్పెషల్‌గా మార్చబోతున్నాయి.


Click it and Unblock the Notifications