EPFO: పీఎఫ్ చందాదారులకు హెచ్చరిక.. ఇక ఆ మొత్తం ఖాతాలోనే ఉంచాలి..!

ఉద్యోగం చేసే వారికి దాదాపు అందరికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. ప్రస్తుతం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో 7 కోట్లకు పైగా చందాదారులు ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. పీఎఫ్ సంస్థ త్వరలో కొత్త పథకాలను అమల్లోకి తీసుకురానుంది. ఇకపై వ్యక్తిగత పీఎఫ్‌ ఖాతాలో 25 శాతం కనీస నిల్వను తప్పనిసరి చేయనుంది. గతేడాది అక్టోబర్ 13న ఈపీఎఫ్ఓ ​​సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సరళీకృత ఉపసంహరణ నిబంధనలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనివల్ల EPF సభ్యులు తమ మొత్తం నిధిలో 50 శాతం నుంచి 77 శాతం వరకు పొందే అవకాశం ఉంది. అయితే కనీసం 25 శాతం నిధులను 'బఫర్' (అత్యవసర నిల్వ)గా అలాగే ఉంచడం తప్పనిసరి చేయనుంది.

అయితే ఖాతాదారులు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి తీసుకోదగిన మొత్తంలో 100% వరకు ఉపసంహరించుకోవచ్చు. అయితే ఇక్కుడ తీసుకోదగిన మొత్తం అంటే కనీసం 25 శాతం మినహాయించని అర్థం. అంటే దీని ప్రకారం పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. కాగా ఇక నుంచి ఉపసంహరణల పరిమితి సంఖ్యను పెంచనుంది. యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్‌ క్లెయిం చేసుకోవడంతోపాటు ఆటోమేషన్‌లో వేగంగా ఆమోదం లభిస్తే వెంటనే ఆ నగదు సత్వరమే బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి.

epfo

గతంలో పీఎఫ్ డబ్బులు రావడానికి చాలా సమయం పట్టేది. దీనివల్ల చాలా మంది ఈపీఎఫ్ఓ ​​సభ్యులు తమ ఈపీఎఫ్ నిధులను 3 రోజుల్లోనే జమ కానున్నాయి. అయితే పీఎఫ్ విత్ డ్రా చేసుకుంటే టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక చందాదారుడు ఐదేళ్ల కంటే తక్కువ కాలం పని చేసి, తన ఈపీఓని ఉపసంహరించుకున్నప్పుడు, జమ అయిన మొత్తం రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే 15జీ ఫామ్ సడ్మిట్ చేస్తే టీడీఎస్ కట్ కాదు.

కాగా.. జూన్ 28 వరకు ఈపీఎఫ్ఓ ఆన్ లైన్ సేవలు షట్ డౌన్ అయ్యాయి. సర్వర్ అప్‌గ్రేడ్, సిస్టమ్ మైగ్రేషన్ కారణంగా తాత్కాలికంగా సేవలు ఆపివేస్తున్నామని ఈపీఎఫ్ఓ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈ సమయంలో క్లెయిమ్ రిక్వెస్ట్, క్లెయిమ్ ప్రాసెసింగ్ వంటివి జరగవని పేర్కొంది. సభ్యులకు మరింత మెరుగ్గా సేవలు అందించడానికి, క్లైమ్ త్వరగా పూర్తి చేయడానికి సిస్టమ్ అప్ గ్రేడ్ చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ 3.o లో భాగంగా పీఎఫ్ డబ్బులను యూపీఐ ద్వారా లేదా ప్రత్యేక ఏటీఎంల ద్వారా తక్షణమే విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+