EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూలై 15 నుంచి పీఎఫ్ వడ్డీ జమ..!
ఉద్యోగం చేసే దాదాపు అందరికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలో నెలకు కొంత మొత్తం జమ చేస్తారు. ఉద్యోగి జీతం నుంచి కొంత, యాజమాన్యం నుంచి కొంత పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. మనం జమ చేస్తున్నా మొత్తానికి కేంద్రం వడ్డీ జమ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ చందాదారులకు శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వార్షిక వడ్డీని వారం రోజుల్లో ఖాతాల్లో జమ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
జూలై 15 నుంచి పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ చేస్తామని వెల్లడించింది. సుమార్ 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్ల వడ్డీని జమ చేయనున్నట్లు ప్రకటించింది. కాగా ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. ఇదే వడ్డీ రేటుతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గల వడ్డీని చందాదారుల ఫీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే వడ్డీ జమకు సంబంధించి ప్రక్రియ మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందని సమాచారం. ఈ పూర్తి అవ్వగానే వడ్డీ జమ ప్రారంభిస్తారని సమాచారం.

ఫీల్డ్ వెరిఫికేషన్ 2,3 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూలై 15 నుంచి పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు మీ ఖాతాలో ఉన్న సొమ్ముకు 8.25 శాతంతో వడ్డీ చెల్లిస్తారు. గతంలో పీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియని పరిశీలిస్తే చాలా ఆలస్యంగా ఉండేది. ఈపీఎఫ్ కు సంబంధించి వార్షిక వడ్డీని ప్రకటించిన కొన్ని నెలల తర్వాత వడ్డీ జమ అయ్యేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఈసారి ఆటోమేటెడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ ప్రాసెసింగ్ సమయం తగ్గిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
తాజాగా ఈపీఎఫ్‌ఓ సంస్థ సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ తీసుకొచ్చింది. దీంతో ఈపీఎఫ్‌ఓకు చెందిన ప్రాంతీయ, ఫీల్డ్ ఆఫీసులు సొంత డేటాబేస్‌లను నిర్వహించాల్సి పని లేకుండా పోయింది. ఇప్పుడు కొత్త వ్యవస్థలో వీటన్నింటిని ఒకే జాతీయ డేటాబేస్ కిందకు తెచ్చారు. దీని వల్ల ఖాతాదారుల రికార్డులన్నీ ఒకే చోట ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఫలితంగా దేశంలోని ఏ ఈపీఎఫ్‌ఓ ఆఫీసు నుంచైనా చందాదారుల రిక్వెస్ట్‌లను ప్రాసెస్ చేసే వీలుంటుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications