Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి దానాపూర్, బెంగళూరు ట్రైన్..!
బెంగళూరు వాసులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. అహ్మదాబాద్-భాగల్పూర్, దానాపూర్-బెంగళూరు మార్గాల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడానికి, ప్రయాణికులకు ఉపశమనం కలిగించడం లక్ష్యంగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా రెండు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని తూర్పు మధ్య రైల్వే నిర్ణయించింది. వారానికి ఒకసారి నడిచే అహ్మదాబాద్-భాగల్పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 26న DDU-పాట్నా-కియుల్ మార్గం ద్వారా తన సేవలను ప్రారంభిస్తుందని తూర్పు మధ్య రైల్వే (CPRO) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సరస్వతి చంద్ర తెలిపారు.
ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరి, శుక్రవారం ఉదయం 6.40 గంటలకు భాగల్పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇది ప్రతి శుక్రవారం సాయంత్రం 6.40 గంటలకు భాగల్పూర్ నుంచి బయలుదేరి, ఆదివారం ఉదయం 5.25 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుందని ఆయన చెప్పారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 22 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 11 జనరల్ కోచ్‌లు, ఎనిమిది స్లీపర్ కోచ్‌లు, రెండు బ్రేక్ వ్యాన్‌లు, ఒక ప్యాంట్రీ కార్ ఉంటాయి. ఈ కొత్త సేవ గుజరాత్, బీహార్, పొరుగు ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

దీనికి అదనంగా రైల్వేలు సెప్టెంబర్ 1 నుంచి ప్రతిరోజూ నడిచే దానాపూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు దానాపూర్ నుంచి బయలుదేరి, తన ప్రయాణంలో మూడో రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణ సర్వీసు సెప్టెంబర్ 3న బెంగళూరు నుంచి ప్రారంభమవుతుందని చంద్ర తెలిపారు. ఈ రైలు రాత్రి 11.50 గంటలకు బయలుదేరి, మూడవ రోజు తెల్లవారుజామున 12.15 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. దానాపూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో రెండు ఏసీ టూ-టైర్ కోచ్‌లు, మూడు ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు, 10 స్లీపర్ కోచ్‌లు, ఏడు జనరల్ కోచ్‌లు, రెండు బ్రేక్ వ్యాన్‌లతో సహా మొత్తం 24 కోచ్‌లు ఉంటాయి.
ఈ రెండు కొత్త రైళ్ల ప్రవేశంతో సుదూర ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని తూర్పు మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే అధిక ప్రయాణికుల రద్దీ ఉన్న మార్గాల్లో అదనపు రవాణా సౌకర్యాలు లభిస్తాయని పేర్కొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications