Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు..!
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. అత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఓ చౌరాస్తాలో మూడు ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరగడం రికార్డుగా చెబుతున్నారు. వీటితో పాటు త్వరలో ఓ అండర్‌పాస్ కూడా రానుంది. ఇక్కడి పైవంతెనల్లో రెండు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు కావడం మరో విశేషం. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ కూడలిలో భూతల, భూగర్భంతో పాటు రెండు అంతస్తుల్లో రోడ్డు నెట్‌వర్క్‌ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఏడాదిలోగా పనులను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఫ్లై ఓవర్లపై వాహనాల రాకపోకలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. ఐఎస్బీ, డీఎల్ఎఫ్ రోడ్ల మధ్య టూవే రాకపోకలను సులభం చేసేందుకు గానూ 720 మీటర్ల పొడవుతో నాలుగు లేన్ల ఫ్లైఓవర్‌ను నిర్మాణం చేపట్టారు. ఈ పైవంతెన అంచుల వెంబడి ఐదు పిల్లర్లు ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్‌తో పాటు సెకండ్ లెవల్ పైవంతెనను కూడా మోయగలిగే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. వీటి మీద ఐఎస్బీ వైపు నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనాల రాకపోకల కోసం 1.2 కిలోమీటర్ల పొడవుతో రెండో అంతస్తులో 3 వరుసల వంతెనను నిర్మాణాలు కొనసాగుతోన్నాయి.

అలాగే డీఎల్ఎఫ్ రోడ్డు నుంచి లింగంపల్లి వైపు వెళ్లేందుకు 948 మీటర్ల పొడవుతో 3 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం చివరి దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రెండు కర్వ్డ్ ఫ్లైఓవర్లను ఫస్ట్ లెవల్ పైవంతెనలోని పిల్లర్లను కనెక్ట్ చేస్తూ నిర్మించేందు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్లు పూర్తి అయితే.. రెండు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ డిజైన్ వల్ల భూసేకరణతో పాటు నిర్మాణ ఖర్చులూ గణనీయంగా తగ్గుతున్నాయని వివరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే గచ్చిబౌలి, లింగంపల్లి మధ్య వాహనాల రాకపోకలు కొనసాగే అవకాశం ఉంది.
గచ్చిబౌలి ప్రాజెక్ట్ పూర్తయితే చౌరస్తాలోట్రాఫిక్ సింపుల్ గా మూ కానుంది. ప్రాజెక్ట్ పూర్తి అయితే గచ్చిబౌలి జంక్షన్ గుండా వెళ్లే వాహనాల ప్రయాణ సమయం 10 నుంచి 15 నిమిషాల వరకు తగ్గే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీ జంక్షన్ ప్రాజెక్ట్ కు కోసం 98 శాతం ఆస్తులు సేకరించామని అధికారులు తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications