For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Archeology of India: సందర్శన ప్రాంతాలకు ఉచిత ప్రవేశం.. 15 వరకు మాత్రమే ఛాన్స్..

|

చారిత్రాత్మక స్మారక చిహ్నం తాజ్ మహల్ ప్రాంగణంలోకి నేటి నుంచి ఆగస్టు 15 వరకు సందర్శకులందరికీ ప్రవేశం ఉచితం అని భారత పురావస్తు శాఖ (ASI) శుక్రవారం తెలిపింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అన్ని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా-రక్షిత స్మారక చిహ్నాలను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15 వరకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

3,793 ప్రాంతాలు

3,793 ప్రాంతాలు

ASI ట్విట్టర్‌లో ఇలా పేర్కొంది, " 13 ఆగస్టు 2022 నుండి 15 ఆగస్టు 2022 వరకు సందర్శకులందరినీ

తాజ్‌లోకి ఉచితంగా అనుమతిస్తాం. దేశవ్యాప్తంగా మొత్తం 3,793 ASI-రక్షిత సైట్‌లు ఉన్నాయి. ఈ సందర్శక ప్రాంతాలకు ఆగస్ట్ 15 వరకు ఎటువంటి సందర్శకులకు ప్రవేశ రుసుము వసూలు చేయవని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

కిషన్ రెడ్డి ట్వీట్..

కిషన్ రెడ్డి ట్వీట్..

"'ఆజాదీ కా #అమృతమహోత్సవ్', 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సందర్శకులకు స్మారక చిహ్నాలు/స్థలాలకు ప్రవేశం ఉచితం. దేశంలో, 2022 ఆగస్టు 5 నుండి 15వ తేదీ వరకు ఎలాంటి రుసుం వసూలు చేయరు" అని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. దీన్ని రీట్వీట్ చేసిన ASI," స్మారక స్థలాలు వెళ్లేవారికి ఆగస్టు15 వరకు ఉచిత ప్రవేశం ఉంటుందని పేర్కొంది.

జాతీయ జెండాలు

జాతీయ జెండాలు

ఆగ్రాలో, ASI తాజ్ మహల్, ఫతేపూర్ సిక్రీ, ఇత్మద్-ఉద్-దౌలాతో సహా దాదాపు 40 స్మారక చిహ్నాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసింది. ఆగ్రాలోని వివిధ స్మారక చిహ్నాలలో ప్రదర్శనలు, జాతీయ జెండాలను ఏర్పాటు చేయనుంది.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేపట్టింది.

English summary

Archeology of India: సందర్శన ప్రాంతాలకు ఉచిత ప్రవేశం.. 15 వరకు మాత్రమే ఛాన్స్.. | The Department of Archeology of India has said that it is providing free entry to the historical sites of the country.

The entry to the premises of historic monument Taj Mahal will remain free for all visitors from today till 15th August, informed the Archaeological Survey of India (ASI) on Friday.
Story first published: Saturday, August 13, 2022, 12:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X