ఎలాంటి గుర్తింపు రుజువు అవసరం లేకుండా రూ. 2,000 నోట్లను మార్చుకోవడానికి అనుమతించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నోటిఫికేషన్‌లను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. రిక్విజిషన్ స్లిప్, గుర్తింపు రుజువు లేకుండా రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పిస్తూ ఆర్‌బీఐ, ఎస్‌బీఐ చేసిన నోటిఫికేషన్‌లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తిరస్కరించింది.
"వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టులు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, మైనింగ్ మాఫియాలు, అవినీతిపరులు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకునే అవకాశం ఉంది" అని పిటిషనర్, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ వాదించారు. నోటిఫికేషన్‌లు ఏకపక్షంగా, అహేతుకంగా ఉన్నాయని, రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. RBI చలామణి నుండి ఉపసంహరించుకున్న రూ. 2,000 నోట్లను మార్చుకోవడానికి ఎటువంటి ఫారమ్, గుర్తింపు రుజువు అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

"ప్రజలందరికీ ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు రూ. 2,000 మార్పిడి సౌకర్యం ఎటువంటి రిక్విజిషన్ స్లిప్ పొందకుండా అనుమతించబడుతుంది," అని బ్యాంక్ మే 20 నాటి సర్క్యులర్‌లో పేర్కొంది. ఇందుకు గుర్తింపు రుజువు అవసరం లేదని పేర్కొంది. కరెన్సీ నోటును ప్రవేశపెట్టే లక్ష్యం నెరవేరిందని ఆర్‌బీఐ మే 19న రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. రూ. 2,000 నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది, అయితే సెప్టెంబర్ 2023 నాటికి వాటిని మార్పిడి/డిపాజిట్ చేయమని ప్రజలను ప్రోత్సహించింది.
కాగా దేశవ్యప్తంగా రూ.2000 నోట్లు ప్రజలు బ్యాంకుల్లో ఇచ్చే బదులుగా ఖర్చు పెడుతున్నారు. షాపింగ్ మాల్స్, హోటళ్లు, వైన్స్, పెట్రోల్ బంక్ లకు రూ.2000 నోట్లను తీసుకొస్తున్నారు. ఢిల్లీలోని ఓ పెట్రోల్ బంక్ రూ.2000 నోటు తీసుకోకుంటే పెట్రోల్ బంక్ సిబ్బంది ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బ్యాంకుల్లో రూ.2000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది.


Click it and Unblock the Notifications