విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి భారీగా క్షీణించాయి. ఆగస్టు 9తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 4.80 బిలియన్ డాలర్లు తగ్గి 670.119 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు వారంలో 675 బిలియన్ డాలర్ల చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 16, 2024న విదేశీ మారక నిల్వల వివరాలను ప్రకటించింది.
దాని ప్రకారం ఆగస్టు 9, 2024 నాటికి విదేశీ మారక నిల్వలు 4.80 బిలియన్ డాలర్లు తగ్గి 670.119 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మొదటి వారంలో విదేశీ మారక నిల్వలు $675 బిలియన్ల జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకోగా.. తాజాగా తగ్గాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు కూడా ఈ కాలంలో 4.079 బిలియన్ డాలర్లు తగ్గి 587.96 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆర్‌బీఐ బంగారం నిల్వలు కూడా తగ్గి 860 మిలియన్ డాలర్లు తగ్గి 59.23 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. SDR $121 మిలియన్లు పెరిగి $18.28 బిలియన్లకు చేరుకుంది.

అంతర్జాతీయ ద్రవ్యనిధిలో నిల్వలు $18 మిలియన్లు పెరిగి $2.63 బిలియన్లకు చేరుకున్నాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు క్షీణించడానికి గల కారణాలను విశ్లేషకులు అంచనా వేశారు. ఇటీవలి కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అందుకే డాలర్లకు డిమాండ్ పెరగడం వల్ల, విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా డాలర్‌తో రూపాయి బలహీనపడటం ఒక కారణంగా చెబుతున్నారు.
రూపాయి బలహీన పడకుండా ఆపడానికి ఆర్బీఐ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. శుక్రవారం కరెన్సీ మార్కెట్‌లో ఒక డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.95 వద్ద ముగిసింది. ఆర్బీఐ ఆగస్ట్ 8, 2024న ద్రవ్య విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 2024 మరియు ఆగస్టు 6 మధ్య విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్లో $9.7 బిలియన్లను కొనుగోలు చేశారని, ఏప్రిల్, మేలో $4.2 బిలియన్ల ప్రవాహం కనిపించిందని RBI గవర్నర్ తెలిపారు.


Click it and Unblock the Notifications