Pakistan Financial Crisis: ప్రజలపై పన్నుల భారం.. ఐఎంఎఫ్ కండిషన్లతో ఇరకాటంలో పాక్..
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు పెరుగుతోంది. పంజాబ్ ప్రాంతంలోని చాలా పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ నిండుకోవడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (PPDA) అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను (OMCలు) డిమాండ్‌కు అనుగుణంగా తగిన సరఫరాలను అందించడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు పాక్ లో ఫిబ్రవరి 9 నాటికి దాని ఫారెక్స్ నిల్వలు $3 బిలియన్ల (తొమ్మిదేళ్ల కనిష్టం) కంటే దిగువకు పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర మరింత సంక్షోభంలోకి వెళ్లింది. పలు నివేదికల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ (SBP) విదేశీ మారక నిల్వలు $2.917 బిలియన్లకు పడిపోయాయి. అదే సమయంలో IMF నుంచి నిధులు పొందడంలో పాక్ చాలా కష్టాలను ఎదుర్కొంటోంది.

పాక్ ఐఎంఎఫ్ నుంచి7 బిలియన్ డాలర్ల రుణం పొందాలంటే.. పాక్ కొన్ని నిబంధనలు, షరతులను పాటించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఐఎంఎఫ్ బృందా 10 రోజుల పాటు చర్చలు జరిపింది.
నాథన్ పోర్టర్ నేతృత్వంలోని IMF మిషన్ జనవరి 31 నుండి ఫిబ్రవరి 9 వరకు ఇస్లామాబాద్‌లో పర్యటించింది.
IMF నుంచి పాక్ కు నిధులు రావావంటే 170 బిలియన్ రూపాయల పన్నులు విధించాల్సి ఉంటుందని పాక్ దార్ చెప్పారు. యితే సామాన్యులపై పన్నులు నేరుగా భారం పడకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. న్నులు విధించేందుకు అప్పటి పరిస్థితిని బట్టి ప్రభుత్వం ఆర్థిక బిల్లు లేదా ఆర్డినెన్స్‌ను ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారు. ఫెడరల్ క్యాబినెట్ ద్వారా అంగీకరించిన ఇంధన సంస్కరణలను అమలు చేస్తామని చెప్పారు.
స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు అవసరమైన విధానాలను అమలు చేయడానికి పాక్ అంగీకరించినట్లు IMF బృందం తెలిపింది. శాశ్వత ఆదాయ చర్యలతో ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం. లక్ష్యం లేని సబ్సిడీలను తగ్గించడం వంటి కీలక ప్రాధాన్యతలను తగ్గించాలని చెప్పినట్ల తెలిపింది.


Click it and Unblock the Notifications