Hyderabad: ఫోన్ ఇవ్వకుండానే ఈఎంఐలు వసూలు.. రిటైల‎‎ర్‎కు రూ.1.14 లక్షల జరిమానా..!

ఒక ఎలక్ట్రానిక్ రిటైలర్, మొబైల్ ఫోన్‌ను అందజేయకుండానే వినియోగదారుడి నుంచి నెలవారీ వాయిదాలను (EMI) వసూలు చేసినందుకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చర్యలు తీసుకుంది. సదరు వినియోగదారుడికి రూ. 1.14 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఫోన్ ధరగా చెల్లించిన రూ. 74,698ని తిరిగి చెల్లించాలని, మానసిక వేదన, ఇబ్బందులకు పరిహారంగా అదనంగా రూ. 30,000, అలాగే వ్యాజ్య ఖర్చుల కింద రూ. 10,000 చెల్లించాలని రిటైలర్‌ను ఆదేశించింది. అంతేకాకుండా, సదరు వినియోగదారుడి లోన్ ఖాతాను శాశ్వతంగా రద్దు చేయాలని కూడా కమిషన్ సూచించింది.

ఈ ఫోన్ సంబంధించి ఘటన మార్చి 2024లో జరిగింది. 34 ఏళ్ల ఫిర్యాదుదారుడు 'జీరో-ఇంట్రెస్ట్ EMI' పథకం, ద్వారా మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఈ రిటైల్ షాప్ కు వెళ్లారు. ఫైనాన్స్ కంపెనీ లావాదేవీని ఆమోదించి, చెల్లింపును విడుదల చేసిన తర్వాత ఫోన్‌ను తీసుకోవచ్చని అతనికి చెప్పారు. అతను అవసరమైన పత్రాలను సమర్పించగా, కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడానికి, ఉత్పత్తిని పంపడానికి స్టోర్ ప్రతినిధి అతనిని 'వన్-టైమ్ పాస్‌వర్డ్' (OTP) అడిగారు. అయితే తనకు ఫోన్ అందలేదని బాధితుడు పేర్కొన్నాడు. ఫోన్ కోసం అతను పదేపదే అడిగినప్పుడు, ఫోన్ డెలివరీ చేస్తామని లేదా డబ్బు తిరిగి ఇస్తామని అతనికి హామీ ఇచ్చారు.

Smart phone

చేతిలో ఫోన్ లేకపోయినప్పటికీ, EMI చెల్లింపులు ప్రారంభం కావడంతో సమస్య మరింత జటిలమైంది. ఏప్రిల్ 3, 2024న మొదటి EMI కింద రూ. 4,204 అతని బ్యాంక్ ఖాతా నుంచి కట్ అయ్యాయి. ఫోన్ అందకపోయినా, ఆ తర్వాత కూడా EMI చెల్లింపులు కొనసాగాయని బాధితుడు కమిషన్‌కు వివరించాడు. చెల్లింపులు కొనసాగుతున్నా రిటైలర్ ఫోన్‌ను అందజేయకపోగా డబ్బును కూడా తిరిగి ఇవ్వకపోవడంతో, అతను వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. రిటైలర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అన్యాయమైన వ్యాపార పద్ధతులను అనుసరించారని, నాణ్యత లేని సేవలను అందించారని అతను ఆరోపించాడు.

అయితే రిటైలర్ ఈ ఆరోపణలను ఖండించారు. వినియోగదారుడు స్టోర్‌కు వచ్చిన రోజే ఫోన్‌ను స్వయంగా తీసుకున్నాడని ఫైనాన్స్ కంపెనీ చెల్లింపును ఆమోదించిన తర్వాతే ఇన్వాయిస్, రసీదు జారీ చేసినట్లు పేర్కొంది. EMI చెల్లింపులతో తమకు సంబంధం లేదని పేర్కొన్న రిటైలర్, వినియోగదారుడి అర్హతను ధృవీకరించుకున్న తర్వాత ఫైనాన్స్ కంపెనీనే స్వతంత్రంగా రుణం మంజూరు చేసిందని తెలిపింది. ఎలక్ట్రానిక్స్ కోసం రుణాలు తీసుకుని, వాటిని తర్వాత మరో వ్యక్తికి తిరిగి అమ్మే ఒక పెద్ద పథకంలో భాగంగానే ఈ ఆరోపణలు ఉన్నాయని ఆరోపించింది. ఈ ఆరోపణలపై పోలీసు విచారణ జరపాలని పేర్కొంది.

ఈ ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు లేవని కమిషన్ పేర్కొంది. క్రిమినల్ కుట్రలో ఫిర్యాదుదారుడి ప్రమేయాన్ని నిరూపించడానికి ఎలాంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR), న్యాయ ఉత్తర్వు లేదా చార్జిషీట్ నమోదు కాలేదని కూడా కమిషన్ గమనించింది. అంతేకాకుండా, ఫోన్ డెలివరీకి సంబంధించిన రాతపూర్వక రుజువును రిటైల్ షాప్ సమర్పించడంలో విఫలమైంది. స్టాక్ రిజిస్టర్ ఎంట్రీ, సంతకం చేసిన రసీదు లేదా గేట్ పాస్‌లో ఎక్కడా కూడా ఆ హ్యాండ్‌సెట్‌ను కస్టమర్‌కు ఇచ్చినట్లు కనిపించడం లేదని కమిషన్ గమనించింది. రిటైలర్‌ను బాధ్యుడిగా నిర్ధారించి, ఫిర్యాదుదారునికి రూ. 1,14,698 చెల్లించాలని ఆదేశించింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+