Vinayaka Chaturthi: వినాయక చవితికి రూ.25,000 కోట్ల బిజినెస్..!
భారతదేశంలో ప్రధాన హిందూ పండుగ అయిన గణేష్ చతుర్థి సందర్భంగా రూ. 25,000 కోట్ల మేర వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. వ్యాపారులు చైనా ఉత్పత్తులకు బదులుగా పూర్తిగా స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో గణేష్ చతుర్థి గణనీయమైన ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రటరీ జనరల్ ఎమెరిటస్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ చెప్పారు. భారతదేశంలో సనాతన ఆర్థిక వ్యవస్థ ప్రాముఖ్యతను, ప్రభావాన్ని చాటిచెప్పడంలో ఈ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.
ఈసారి పండుగ కోసం దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల గణేష్ పండళ్లు ఏర్పాటు చేసినట్లు CAIT జాతీయ అధ్యక్షుడు బి.సి. భార్తియా పేర్కొన్నారు. 7 లక్షలకు పైగా పండళ్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక 5 లక్షలతో తర్వాతి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఒక్కొక్కటి 2 లక్షల పండళ్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక్కో పండల్‌కు కనీసం రూ. 50,000 ఖర్చు అవుతుందని అంచనా వేస్తే, కేవలం ఏర్పాటు, అలంకరణలు, పూజా కార్యక్రమాలకే అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,000 కోట్లకు పైగా ఉంటుందని ఆయన అంచానా వేశారు.

గణేష్ చతుర్థి గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని భార్తియా వివరించారు. కేవలం గణేశ విగ్రహాల వ్యాపారం ద్వారానే రూ. 500 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పూలు, పూలదండలు, కొబ్బరికాయల వంటి నిత్యావసర వస్తువుల ద్వారా ఆర్థిక వ్యవస్థకు అదనంగా మరో రూ. 500 కోట్లు సమకూరుతాయని ఆయన వివరించారు. గణేష్ చతుర్థి సమయంలో మోదకాలు, ఇతర మిఠాయిలకు ఉండే డిమాండ్ కారణంగా అమ్మకాలు రూ. 2,000 కోట్లకు పైగా ఉంటాయన్నారు.
అలాగే క్యాటరింగ్, అల్పాహార సేవల ద్వారా దాదాపు రూ. 3,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు.తెలంగాణలో కూడా వినాయక చవతి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఘనంగా వినాయక చవితి నిర్వహిస్తారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
