BHIM App: భీమ్ పేమెంట్స్ యాప్ వాడుతున్న వారికి గుడ్ న్యూస్..!
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భీమ్ సర్వీస్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన భీమ్(BHIM) యాప్‌లో మరిన్ని ఆర్థిక సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. పలు ఆర్థిక సంస్థలతో కలిసి రుణాలు, పింఛన్ పథకాలు, బీమా, ఇన్వెస్ట్మెంట్ అప్షన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. భీమ్ పేమెంట్స్ యాప్ గత 12 నెలల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది.
2025 జూన్ నుంచి 2026 మే మధ్య భీమ్ పేమెంట్స్ యాప్ లావాదేవీల సంఖ్య మూడు రెట్లకు పెరిగింది. 2025 జూన్ లో భీమ్ పేమెంట్స్ 79.64 మిలియన్ల నుంచి 206 మే నాటికి 244 మిలియన్లకు పెరిగింది. మే 2026లో భీమ్ ఈ ప్లాట్‌ఫారమ్ రూ. 26,952 కోట్ల విలువైన లావాదేవీలను జరిగాయి. తెలంగాణలో కూడా భీమ్ యాప్ వాడకం పెరిగింది. రాష్ట్రంలో 2025 నుంచి 2026 మధ్య లావాదేవీలు మూడు రెట్లు పెరిగాయి. 2026 మేలో రాష్ట్రంలోని ఈ ప్లాట్‌ఫారమ్‌పై జరిగిన వ్యాపార లావాదేవీలలో కిరాణా సరుకుల వాటా 23.9 శాతంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫుడ్ అవుట్‌లెట్లు 18.1 శాతం ఉండగా క్విక్ కామర్స్ 11.6 శాతంగా ఉంది.

డైరీ, బేకరీలు 3.2 శాతం ఉండగా, ఇంధన కేంద్రాలు 2.8 శాతం, ఈ-కామర్స్ 2.2 శాతం, ప్రభుత్వ సేవలు 2 శాతంగా ఉన్నాయి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా భీమ్ పేమెంట్స్ యాప్ బలమైన వృద్ధిని సాధిస్తుందని ఆ సంస్థ ఎండీ లలిత నటరాజ్ తెలిపారు. కిరాణా సరుకులు, ఫుడ్ అవుట్‌లెట్లు, క్విక్ కామర్స్ వంటి విభాగాలలో జరుగుతున్న లావాదేవీల ద్వారా ఈ వృద్ధి సాధిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే భీమ్ పేమెంట్స్ యాప్ లో రుణాలు, పింఛన్ పథకాలు, బీమా, ఇన్వెస్ట్మెంట్ అప్షన్లను తీసుకోస్తామని ప్రకటించారు.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భీమ్ సర్వీస్ లిమిటెడ్ ప్రకారం భీమ్ యాప్ లో రుణాలు, పింఛన్ పథకాలు, బీమా, ఇన్వెస్ట్మెంట్ అప్షన్లను అందుబాటులోకి వృద్ధి మరితం పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ రంగంలో ఇప్పటికే గట్టి పోటీ ఉంది. ఫోన్ పే, గూగుల్ పే తమ యాప్ లో అనేక సేవలు అందిస్తున్నాయి. వీటిని తట్టుకుని భీమ్ యాప్ మరింత ముందుకు వెళ్లాలంటే.. వినియోగదారులను మరింతగా ఆకర్షించాలని చెబుతున్నారు.
దేశంలో యూపీఐ చెల్లింపులు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక యూపీఏ పేమెంట్లు ఇండియాలోనే జరుగుతున్నాయి. ప్రజలకు అనేక యూపీఐ యూపీఐ యాప్స్ రావడంతో పాటు రివార్డులు కూడా అందిస్తుండడంతో వాటిని వినియోగించేవారి సంఖ్య భారీగా ఉంది.


Click it and Unblock the Notifications