AP: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీలో మరో రెండు కొత్త ఎయిర్ పోర్టులు..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్రం ఆమోదం ముద్ర వేసింది. వీటి నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికల తయారీకి కూడా అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీ ఎల్) సిద్ధమైనట్లు సమాచారం. ఈ రెండు విమానాశ్రయాల నిర్మాణానికి పౌర విమానయాన శాఖ సైట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సైతం జారీ చేయటంతో.. విమానాశ్రయ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. కుప్పం, శ్రీకాకుళంలో విమానాశ్రయాల నిర్మాణానికి సివిల్ ఏవియేషన్ శాఖ సైట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ ఇచ్చింది.
అదే విధంగా ఈ రెండు విమానాశ్రయాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్) ఏర్పాట్లు చేస్తోంది. రక్షణ మంత్రిత్వశాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్(డీజీసీఏ), ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల మార్గదర్శకాలకు లోబడి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ నుంచి ఎన్ఓసీ పొందాలని తేల్చి చెప్పింది. విమానాశ్రయాలను నిర్మించే ప్రదేశాలకు 150 కి.మీ. పరిధిలోని సివిలియన్ ఎయిర్పోర్టు లపై థర్డ్ పార్టీ ఇంపాక్ట్ ఎసెస్మెంట్ రిపోర్టు అందించాలని గుర్తు చేసింది.

నెట్ జీరో సాధించటానికి వీలుగా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తీసుకునే చర్యలను ఎయిర్పోర్టు మాస్టర్ ప్లాన్లో చేర్చాలని పేర్కొంది. శ్రీకాకుళం విమానాశ్రయానికి ఈ ఏడాది మే 6న, కుప్పం విమానాశ్రయానికి జూన్ 15న ఏపీఏడీసీఎల్ సైట్ క్లియరెన్స్ల కోసం దరఖాస్తు చేశారు. మూడు, నాలుగు నెలల్లోనే అనుమతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా కుప్పం లో 1,788 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 1,300 ఎకరాలు సేకరించింది. కుప్పం విమానాశ్రయాన్ని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంతో బండ్లింగ్ చేయించాలని అధికారులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications