Edible Oil: వంట నూనె ధరలు తగ్గించాల్సిందే... కంపెనీలకు కేంద్రం ఆదేశం..!
వంట నూనెలపై దిగుమతి సుంకాల తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం నాడు అన్ని వంట నూనె కంపెనీలను ఆదేశించింది. పండుగ సీజన్‌కు ముందే వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెల ధరలు గణనీయంగా పెరగడం, తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమయ్యాయి. దిగుమతి సుంకం తగ్గింపు ద్వారా లభించే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు అందేలా చూడాలని వంట నూనె సంఘాలు, పరిశ్రమ వర్గాలకు సూచనలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
వినియోగదారుల ప్రయోజనాలతో పాటు రైతులు, పరిశ్రమల ప్రయోజనాలను సమతుల్యం చేసేలా తగిన చర్యలు తీసుకుంటూ, ధరలను నిరంతరం పర్యవేక్షిస్తామని కేంద్రం గురువారం పేర్కొంది. ప్రభుత్వం ఆదేశాలతో కంపెనీలు కూకింగ్ ఆయిల్ ధరలను తగ్గించే అవకాశం ఉంది. ముడి పామాయిల్, సోయాబీన్ మరియు పొద్దుతిరుగుడు నూనె, అలాగే శుద్ధి చేసిన సోయాబీన్ మరియు పొద్దుతిరుగుడు నూనెలపై విధించే మొత్తం దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం బుధవారం నాడు తగ్గించిన విషయం తెలిసిందే. ముడి పామాయిల్, సోయాబీన్ నూనెలపై సుంకాన్ని సగానికి తగ్గించగా, ముడి పొద్దుతిరుగుడు నూనెపై పన్నును పూర్తిగా రద్దు చేసింది. ఈ మార్పుల ప్రకారం ముడి పామాయిల్, ముడి సోయాబీన్ నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (BCD) 10 శాతం నుంచి 5 శాతాని తగ్గించినట్లు ప్రకటించింది.

ముడి పొద్దుతిరుగుడు నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి సున్నాకు తగ్గించింది. ప్రభుత్వం శుద్ధి చేసిన వంట నూనెలపై కూడా సుంకాలను తగ్గించింది. శుద్ధి చేసిన పామాయిల్, శుద్ధి చేసిన సోయాబీన్ నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 32.5 శాతం నుంచి 27.5 శాతానికి చేర్చింది. ఇక శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు నూనెపై సుంకాన్ని 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గించింది. 23 సెప్టెంబర్ 2026 నాటి నోటిఫికేషన్ నెం. 31/2026-కస్టమ్స్ ప్రకారం, సవరించిన సుంకాలు సెప్టెంబర్ 24 నుంచి అమల్లోకి వస్తాయి. గత ఏడాది కాలంలో భారతదేశంలో కూరగాయల నూనెల ధరలు దాదాపు 20 శాతం పెరిగిన తరుణంలో ఈ సుంకాల తగ్గించారు.
పామాయిల్, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెలు ఎక్కువగా దిగుమతి చేసుకోంటుంది. భారతదేశానికి వంట నూనెల సరఫరా ప్రధానంగా మలేషియా, ఇండోనేషియా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ నుంచి వస్తుంది. ఈ తాజా సుంకాల మార్పులు ముఖ్యమైన వంట నూనెలపై దిగుమతి సుంకాల భారాన్ని తగ్గిస్తాయని, పెరిగిన ధరల మధ్య దేశీయ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగిస్తాయని భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
