Rations Cards: షాకింగ్ న్యూస్.. వారి రేషన్ కార్డులు రద్దు చేయనున్న కేంద్రం..!
దేశవ్యాప్తంగా కోట్లాది రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఇందులో చాలా మంది అనర్హులకు రేషన్ కార్డులు ఇచ్చారు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి, ట్యాక్స్ పే చేస్తున్నవారికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. పారదర్శకంగా రేషన్ పథకాన్ని అమలు చేసేందుకు నిజమైన లబ్దిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందించే దిశగా చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా అక్రమంగా రేషన్ కార్డు పొందినవారిని గుర్తించేందుకు సిద్ధమైంది. అక్రమ పద్దతిలో రేషన్ కార్డు పొందిన వారి రేషన్ కార్డులు రద్దు చేయనున్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం కలిసి అనర్హుల రేషన్ కార్డులు గుర్తించి ఏరి వేయనున్నారు. ఎవరి రేషన్ కార్డులు కట్ అవుతాయంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నవారు, కారు కలిగి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం సంపాదిస్తున్నవారి రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉంది. గతంలో రేషన్ కార్డు ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉండేవి. గ్రాముల్లో 5 ఎకరాల లోపు ఉన్నవారికి రేషన్ కార్డులు ఇచ్చేవారు. నగరాల్లో 100 గజాల కంటే తక్కువ స్థలం ఉన్నవారికి రేషన్ కార్డులు ఇచ్చారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చారు. దీంతో ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అయ్యాయి.

పలు పథకాల్లో అనర్హుల వల్ల అర్హులు నష్టపోతున్నారు. ఉచిత బియ్యం నుంచి ఆరోగ్య బీమా వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అయింది. ప్రభుత్వ పథకాలు పొందేందుకు కొంతమంది అనర్హులు రేషన్ కార్డు వివిధ మార్గాల్లో పొందినట్లు కేంద్రం దృష్టికి వెళ్లింది. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉచిత రేషన్ ప్రయోజనాలను పొందుతున్నట్లు సర్వేలో బయట పడింది. అలాగే కారు ఉన్నవారు, ఏసీ సౌకర్యం కలిగిన వారు కూడా ఉచిత రేషన్ పొందుతున్నట్లు క్షేత్రస్థాయి అధ్యయనంలో తేలింది. దీంతో రేషన్ కార్డుల జారీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలనకు శ్రీకారం చుట్టింది. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేలో చాలామంది అనర్హులను గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద ఉచిత రేషన్ పొందుతున్న వారిలో 13.2 శాతం మంది అనర్హులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడయింది. పశ్చిమ బెంగాల్ లో ఎక్కువగా రేషన్ కార్డు అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత త్రిపురా, తమిళనాడు, మేఘాలయాలో అనర్హులను గుర్తించారు. తెలంగాణ, ఏపీలో కూడా అనర్హులను గుర్తించారు. వీరందరి రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications