Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు..!

హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. చాలా చోట్ల భాగ్యనగరం ఔటర్ రింగ్ రోడ్ దాటి పోయింది. జనాభా కూడా శరవేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కాకుండా పక్క రాష్ట్రం ఏపీ నుంచి హైదరాబాద్ భారీగా వలసలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. కొన్ని మార్గాల్లో 5 కి.మీ దూరానికి 30 నిమిషాల సమయం పడుతుంది. అందుకే ట్రాఫిక్ తగ్గించేందుకు సిటీలో చాలా చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని ఫ్లై ఓవర్లు, డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించడానికి ప్రభుత్వం నిర్మించింది.

ఇప్పటికే సికింద్రాబాద్ శామీర్ పేట మార్గం డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడర్ల పనులు కొనసాగుతున్నాయి. తాజాగా ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. నగరంలో ఎక్కువ ట్రాఫిక్ ఉండే ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ మార్గంలో డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Elevated Corridor

డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి అయితే విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ కష్టాలు తగ్గే అవకాశం ఉంది. వీటితో పాటు కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ల శంకుస్థాపన ప్రతిపాదనకు కూడా గడ్కరీ సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఈ భేటీలో హైదరాబాద్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణంపైనా కూడా చర్చ జరిగినట్లు సమాచారం. నవంబర్‌ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న 'ఇండియన్‌ రోడ్‌' కాంగ్రెస్‌ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని గడ్కరీని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించారు. కాగా పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి రోడ్డును కలుపుతూ ఆరు లేన్లతో 4 కి.మీ. మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కేబీఆర్‌ పార్కు చుట్టూ ఏడు కూడళ్లలో అండర్‌పాస్‌లు, స్టీలు వంతెనలు నిర్మించే పనులను రద్దు చేస్తూ.. బదులుగా పొడవైన పైవంతెన నిర్మాణానికి ఒకే చెప్పింది. పంజాగుట్ట, హైటెక్‌సిటీ మధ్య నిత్యం లక్షకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఆయా వాహనాలు పంజాగుట్ట నాగార్జున సర్కిల్, టీవీ9 ఆఫీస్, ముగ్ధ జంక్షన్ సిగ్నళ్ల కారణంగా 5 నుంచి 10 నిమిషాలు ఆగాల్సి వస్తుంది. అయితే ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే వాహనదారులు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+