దేశంలో గోధుమల ధరరలు పెరుగుతున్నాయి. దీంతో గోధుమల ధరల పెరుగుదలను నియంత్రించడానికి, పిండి ధరను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనేక చర్యలు తీసుకుంటొంది. ఇందులో భాగంగా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) కింద ప్రభుత్వం 13 ఈ-వేలంలో 18.09 లక్షల టన్నుల గోధుమలను విక్రయించింది. ఇది గోధుమలు, గోధుమ పిండి ధరలను తగ్గించడంలో సహాయపడనుంది. 18.09 లక్షల టన్నుల గోధుమల ఈ-వేలం సెంట్రల్ పూల్ నుంచి హోల్‌సేల్ వినియోగదారులకు విడుదల చేశారు.
ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ కింద హోల్ సేల్ కస్టమర్లకు అదనంగా 50 లక్షల టన్నుల గోధుమలు, 25 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9న ప్రకటించింది. వీక్లీ ఇ-వేలం ద్వారా గోధుమలు క్వింటాల్‌కు రూ. 2125 రిజర్వ్ ధరకు విక్రయిస్తున్నారు. ఇది ప్రస్తుత MSP అంటే కనీస మద్దతు ధరకు సమానం. ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం, సెప్టెంబర్ 21 వరకు మొత్తం 13 ఇ-వేలం నిర్వహించింది.

ఇందులో 18.09 లక్షల టన్నుల గోధుమలు ఈ పథకం కింద విక్రయించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 480కి పైగా డిపోల నుంచి వారంవారీ వేలంలో రెండు లక్షల టన్నుల గోధుమలను అమ్మారు. ఆహార మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, OMSS విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా, బహిరంగ మార్కెట్‌లో గోధుమ ధరలు నియంత్రణలో ఉన్నాయని చెబుతున్నారు.
ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం, మిగిలిన 2023-24 కాలానికి OMSS విధానాన్ని కొనసాగించడానికి సెంట్రల్ పూల్‌లో గోధుమల తగినంత నిల్వ ఉంది. ప్రతి వారపు ఈ-వేలంలో విక్రయించే పరిమాణం ప్రతిపాదిత పరిమాణంలో 90 శాతానికి మించలేదని, దేశవ్యాప్తంగా గోధుమలు తగిన పరిమాణంలో లభిస్తున్నాయని ఆహార సరఫరా మంత్రిత్వ శాఖ తెలిపింది.గోధుమల సగటు అమ్మకపు ధరలో తగ్గుదల ధోరణి బహిరంగ మార్కెట్‌లో గోధుమల మార్కెట్ ధరలు మెత్తబడిందని చూపిస్తుంది.
ఆగస్టులో ఈ-వేలం గోధుమల వెయిటెడ్ సగటు అమ్మకపు ధర క్వింటాల్‌కు రూ. 2254.71 ఉండగా, సెప్టెంబర్ 20 నాటికి ఇది క్వింటాల్‌కు రూ.2,163.47కి తగ్గిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అటు బియ్యం, చక్కెర, ఉల్లి ధరలు తగ్గించడానికి కేంద్రం చర్యలు చేపడుతుంది.


Click it and Unblock the Notifications