దేశంలో గోధుమల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు గోధుమల ధరలు పెరగడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం గోధుమల నిల్వ పరిమితిని 3000 టన్నుల నుంచి 2000 టన్నులకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది. ఇటీవలి కాలంలో గోధుమ ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, స్టాక్ పరిమితిని సమీక్షించామని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.
సెప్టెంబర్ 14, 2023 నుంచి వ్యాపారులు, టోకు వ్యాపారులు, పెద్ద చైన్ రిటైలర్లు స్టాక్ పరిమితిని తగ్గించినట్లు చెప్పారు. నిల్వ పరిమితిని 2,000 టన్నులకు తగ్గించినట్లు వివరించారు. అంతకుముందు జూన్ 12, 2023 న ప్రభుత్వం గోధుమ వ్యాపారుల కోసం మార్చి 2024 వరకు 3,000 టన్నుల గోధుమ స్టాక్ పరిమితిని విధించింది. ప్రస్తుతం దీన్నీ 2,000 టన్నులకు తగ్గించింది. గత నెలలో, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఎన్‌సిడిఎక్స్‌లో గోధుమ ధరలు నాలుగు శాతం పెరిగాయి.

గోధుమల ధర క్వింటాల్‌కు రూ.2,550కి పెరిగింది. దేశంలో తగినంత గోధుమ లభ్యత ఉందని, అయితే కొందరు కృత్రిమంగా గోధుమల కొరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఆహార కార్యదర్శి చెప్పారు. గోధుమ దిగుమతులపై పన్నును ఎత్తివేసే యోచన ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. రష్యా నుంచి గోధుమల దిగుమతిపై ప్రభుత్వ వైఖరిని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అలాంటి ప్రణాళిక లేదని అన్నారు. ఆహార సరఫరా మంత్రిత్వ శాఖ తన విడుదలలో అన్ని గోధుమ నిల్వ సంస్థలు గోధుమ స్టాక్ పరిమితి పోర్టల్‌లో ( https://evegoils.nic.in/wsp/login ) నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రతి శుక్రవారం పోర్టల్‌లో స్టాక్ సమాచారాన్ని వారికి అందించాలని పేర్కొంది. అలా చేయని వ్యాపారులపై నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. కొత్త ఆర్డర్ నోటిఫికేషన్ జారీ చేసిన 30 రోజుల్లోగా నిర్దేశిత స్టాక్ పరిమితికి మించి ఎక్కువ స్టాక్ ఉన్న వ్యాపారులు నిర్ణీత పరిమితిలోపు స్టాక్‌ను తీసుకురావాలని ప్రభుత్వం తెలిపింది. దేశంలో గోధుమలకు కృత్రిమ కొరత ఏర్పడకుండా చూసేందుకు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్టాక్ పరిమితిని పర్యవేక్షిస్తూనే ఉంటాయ చెప్పింది. ధరలను నియంత్రించేందుకు, మార్కెట్‌లో అందుబాటులో ఉండేలా నిశితంగా పరిశీలిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications