Petrol and Diesel prices: శుభవార్త చెప్పిన కేంద్రం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..
చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) సామాన్య పౌరులకు శుభవార్త చెప్పాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. మార్చి 15 శుక్రవారం నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
పెట్రోలు, డీజిల్ ధరలను రూ.2 తగ్గించారు. ముంబైలో పెట్రోలు ధర శుక్రవారం నుంచి రూ.104.21, కోల్‌కతాలో రూ.103.94, చెన్నైలో రూ.100.75. లీటర్ డీజిల్ ధర ముంబైలో రూ.92.15, కోల్‌కతాలో రూ.90.76, చెన్నైలో రూ.92.34గా ఉంది.
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.107 లుగా ఉంది. భారతదేశం అంతటా ధర తగ్గిధరల సవరణ అమలులోకి వచ్చిన తర్వాత, దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.72 నుంచి రూ.94.72 తగ్గింది. పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు వినియోగదారుల ఖర్చును తగ్గించనుంది. డీజిల్‌తో నడిచే 58 లక్షలకు పైగా భారీ వస్తువుల వాహనాలు, 6 కోట్ల కార్లు, 27 కోట్ల ద్విచక్ర వాహనాల నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుందనిపెట్రోలియం మంత్రిత్వ శాఖ తన పోస్ట్‌లో పేర్కొంది.

ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. భారతదేశంలో ఇంధన ధరలను స్థిరీకరించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం వహించారని ప్రశంసించారు. గత రెండేళ్లలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగని, తగ్గిన ఏకైక దేశం భారత్ అని పూరీ హైలైట్ చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలను రూ.2 తగ్గించడం ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కోట్లాది మంది భారతీయుల కుటుంబ సంక్షేమం, సౌలభ్యమే తన ధ్యేయమని మరోసారి నిరూపించుకున్నారని పూరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కాగా పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంత కాలంగా స్థిరంగా ఉన్నాయి. ఈ మధ్యే మహిళా దినోత్సవం 'కానుక'గా గృహ బడ్జెట్‌లకు కొంత ఊరటనిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాన్-సబ్సిడీ రహిత డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరలను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించిన వారం తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలలో తగ్గాయి.


Click it and Unblock the Notifications