Gas Cylinder: పండుగ పూట శుభవార్త చెప్పిన కేంద్రం.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..
కేంద్రం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా పేదవారికి ఇది గుడ్ న్యూస్. కేంద్రం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.100 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. శుక్రవారం మహిళ దినోత్సవం రోజు కూడా కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాము మహిళ సాధికారతకు కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. అందుకే వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తున్నట్లు పేర్కొంది.
మార్చి 7న జరిగిన కేబినెట్ లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) సబ్సిడీని దాని లబ్ధిదారులకు మార్చి 2025 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరికి 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై 300 రూపాయల సబ్సిడీ కొనసాగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద కుటుంబాలకు అందించే వంటగ్యాస్ సబ్సిడీని 14.2 కిలోల సిలిండర్ కు కేంద్రం 2023 అక్టోబర్ లో 300కి పెంచిన సంగతి తెలిసిందే.

అయితే ఒక సంవత్సరంలో 12 సిలిండర్లకు మాత్రమే సబ్సీడీ వర్తిస్తుంది. తాజాగా మిగతా వినియోగదారులకు కేంద్రం రూ.100 తగ్గించింది. అయితే తెలంగాణలో ఇప్పటికే రూ.500 లకే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.1000 ఉండగా.. అందులో రూ.500 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.
అయితే తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 900 తగ్గడంతో రాష్ట్రం ప్రభుత్వం రూ.500 సబ్సిడీ కొనసాగిస్తుందా.. లేదా.. రూ.400 చెల్లించి.. మిగతా రూ.500 వినియోదారులు చెల్లించేలా నిర్ణయం తీసుకుంటుందా చూడాలి. వంట గ్యాస్ సిలిండర్ తగ్గడం సామాన్యులకు ఊరనిచ్చే అంశంగా చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications