Parboiled Rice: ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం.. కేంద్రం కీలక నిర్ణయం..
పెరుగుతోన్న బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పుడుబియ్యం(పారా బాయిల్డ్ రైస్) ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్ జూలై 20న బస్మాతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన సంగతి తెసిందే.
ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) బియ్యం ధరల సూచిక ప్రకారం ప్రపంచ ధరలను 12 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. పార్బాయిల్డ్ రకం ఎగుమతులపై తాజా నియంత్రణతో అంతర్జాతీయంగా బియ్యం ధరలను మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్ బాస్మాతియేతర బియ్యంపై ఎగుమతిపై బ్యాన్ విధించడంతో బారాబాయిల్డ్ రైస్ డిమాండ్ ఏర్పండి. ఉప్పుడు బియ్యం ధరలు కూడా పెరగడం ప్రారంభమయ్యాయి.

అందుకే వీటి ఎగుమతులపై సుంకాన్ని విధించారు. కేంద్ర నిర్ణయంతో ఉప్పుడు బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉంది. అధిక ఆహార ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆహార ద్రవ్యోల్బణం జులైలో 11% పెరిగింది. మొత్తం వినియోగదారు ద్రవ్యోల్బణం రేటు 15 నెలల గరిష్ట స్థాయి 7.44%కి పెరిగింది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఉల్లిగడ్డ ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్ర ఇటీవలకే కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధిస్తోంది. కాగా ఇన్ని రోజులు భారీగా పెరిగిన టమాటా ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. కానీ అల్లు, వెల్లులి ధరల ఎక్కువగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.
"ఆహార ద్రవ్యోల్బణానికి ప్రస్తుత ప్రమాదం కూరగాయలకు అధిక వర్షపాతం నష్టం నుండి ఉద్భవించింది. ప్రస్తుత ఉత్పాదక ధోరణులను పరిశీలిస్తే, పప్పు ధాన్యాలు హాని కలిగించే స్థితిలో ఉన్నాయి "అని క్రిసిల్ లిమిటెడ్ చీఫ్ ఎకనామిస్ట్ ధర్మకీర్తి జోషి ఇటీవలి పరిశోధన నోట్‌లో తెలిపారు.


Click it and Unblock the Notifications