దేశంలో కార్బన ఉద్గారాలు తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనగోలును ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పెట్రోల్, డిజీల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రికల్ వాహనాలపై వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్కసారి చార్జింగ్ చేసుకుంటే సుమారు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల దూరం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసే వాహనాలు వస్తున్నాయి. ఎలక్ట్రికల్లో టూ వీలర్సే కాకుండా ఆటోలు, కార్లు, బస్సులు కూడా వస్తున్నాయి.
ఎలక్ట్రిక్ టూ వీలర్స్ బరువు తక్కువగా ఉండడంతో మహిళలకు ఉపయుక్తంగా ఉంటున్నాయని చెబుతున్నారు. మరోవైపు వీటి తయారీ, కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఫేమ్-2 సబ్సిడీలు కూడా అందిస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతోన్నాయి. ఈ ఫేమ్-2 సబ్సిడీలను మార్చి నెలాఖరుకు నిలిపివేస్తున్నట్లు తెలిసిన సంగతే. అయితే కేంద్రం మరో కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అమలు చేయాలని భావిస్తోంది.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇస్తోంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ను ప్రారంభించనుంది. ఈ పథకం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తుంది. దాదాపు నాలుగు నెలల పాటు కొనసాగనుంది. పథకం అమలులోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల్లో 3,33,387 ద్విచక్ర వాహనాలకు రూ.10 వేలు చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు.
ఇలా రూ.33 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల (చిన్న వాహనాలు)కు సంబంధించి ఒక్కో వాహనానికి రూ. 25 వేలు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇలా 13,590 ఈ-రిక్షాల కోసం రూ. 33.97 కోట్లు కేటాయించారు. అలాగే ఎలక్ట్రిక్ ఆటోలకు ప్రోత్సాహకంగా గరిష్టంగా రూ.50 వేలు అందించనున్నారు. దీనికి రూ.126.19 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. 2024 ఏప్రిల్ నుంచి నాలుగు నెలలు పాటు సబ్సిడీగా రూ.500 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications