భారత ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లకు సంబంధించి భద్రతా హెచ్చరికలను జారీ చేసింది. ప్రత్యేకంగా శామ్‍సంగ్ గెలాక్సీ ఫోన్లపై వినియోగదారులను అలెర్ట్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఫోన్‌లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, వెంటనే తమ ఫోన్‌లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి.
శామ్‍సంగ్ పాత, కొత్త మోడల్‌లలో భద్రతలోపాలున్నట్లు స్పష్టం చేసింది. Samsung Galaxy ఫోన్లలో భద్రత లోపాలున్నట్లు పేర్కొంది. సైబర్ నేరస్తులు లక్షల మంది శాంసంగ్ ఫోన్‌లలోని వ్యక్తిగత డేటాను తస్కరించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. డిసెంబర్ 13న ఈ విషయాన్ని తెలిపింది. ఇప్పటికే ఉన్న శామ్‍సంగ్ వినియోగదారులు తమ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఫర్మ్‌వేర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కోరింది.

శాంసంగ్ ఫోన్‌లలో లోపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సైబర్ నేరస్తులు యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించి ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. యూజర్లు శాంసంగ్ సంగ్ ఆండ్రాయిడ్ వెర్షన్ 11,12,13,14లోని ఆపరేటింగ్ సిస్టంను అప్‌డేట్ చేసుకోవాలని వివరించింది. భారత ప్రభుత్వం ఈ వారంలో అదనపు భద్రతా హెచ్చరికలను జారీ చేసింది.
"ప్రత్యేకంగా Samsung Galaxy ఫోన్‌ల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నుండి వచ్చిన భద్రతా సలహా పాత, కొత్త మోడల్‌లలో విస్తరించి ఉన్న మిలియన్ల కొద్దీ Samsung Galaxy ఫోన్‌లను ప్రభావితం చేస్తుంది" అని వివరించారు. ఈ ముప్పుకు గురయ్యే సాఫ్ట్‌వేర్‌లో Samsung మొబైల్ Android వెర్షన్‌లు 11, 12, 13 మరియు 14 ఉన్నాయి.


Click it and Unblock the Notifications