ప్రస్తుతం ఎందులోనైనా నకిలీల బెడద పెరిగిపోతోంది. ఈ నకిలీలు బెడద మందుల్లో కూడా ఉంది. ఈ మధ్య చాలా మెడిసన్స్ నకిలీవి వస్తున్నాయి. నకిలీపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. అదే ఔషధాలపై క్యూఆర్ కోడ్ ముద్రించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఫార్మా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. మందులపై క్యూఆర్ కోడ్ ముద్రించడం 2023 ఆగస్టు 1 నుంచి అమలులోకి రానుంది. ఔషధాలను తయారు చేసే అన్ని ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మార్కెట్‌లో విక్రయిస్తున్న నకిలీ మందులను నియంత్రించవచ్చని కేంద్రం పేర్కొంది.

300 పెద్ద ఫార్మా కంపెనీలు
ప్రస్తుతం కేవలం 300 పెద్ద ఫార్మా కంపెనీలను మాత్రమే తమ మందులపై బార్‌కోడ్‌లు పెట్టాలని కేంద్రం ఆదేశించింది. ఇందులో అల్లెగ్రా, డోలో, ఆగ్మెంటిన్, సారిడాన్, కాల్పోల్, థైరోనార్మ్ వంటి బ్రాండ్ పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత క్రమంగా అన్ని కంపెనీలకు విస్తరించాలని నిర్ణయించింది. జూన్ 2022 నెలలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయంపై వారి అభిప్రాయాన్ని కోరుతూ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అనంతరం ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ చట్టం
డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని రూల్ 96లోని హెచ్2 ప్రకారం, ఇప్పుడు 300 ఔషధ కంపెనీలు తమ ప్రాథమిక, ద్వితీయ శ్రేణిలో బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌ను ఉంచాల్సిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని మధ్యతరగతి, తక్కువ-ఆదాయ దేశాలలో నకిలీ మందుల వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ప్రజల ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ QR కోడ్‌తో లాభాలు..
మందులపై వచ్చే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం వల్ల ఔషధం పేరు, సాధారణ పేరు తెలుస్తుంది. బ్రాండ్ పేరు, ఫార్మా కంపెనీ పేరు, చిరునామా, డ్రగ్ బ్యాచ్ నంబర్, ఔషధం ఏ రోజు తయారు చేశారు. ఔషధం చివరి గడువు తేదీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ లైసెన్స్ నంబర్ తెలిస్తుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications