Health Drinks: హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి బోర్న్ వీటాను తొలగించండి..
హెల్త్ డ్రింక్ లపై వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇ-కామర్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్‌ఎస్‌ఎస్ యాక్ట్ 2006) కింద దేన్నీ కూడా 'హెల్త్ డ్రింక్' పరిగణించలేదని.. అందుకే బోర్న్‌విటాతో సహా ఇతర పానీయాలను ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలోని హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంతి తొలగించాలని స్పష్టం చేసింది. ఇ-కామర్స్ కంపెనీలు/ పోర్టళ్లు బోర్నవిటా సహా అన్ని డ్రింక్స్/ బేవరేజెస్‌ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని చెప్పింది.
ఏప్రిల్ 10 నాటి లేఖలో, 'హెల్త్ డ్రింక్స్' కేటగిరీ నుండి బోర్న్‌విటాతో పాటు ఇతర పానీయాలను తొలగించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇ-కామర్స్ కంపెనీలకు సూచించింది. "నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR), CRPC చట్టం 2005లోని సెక్షన్ 14 కింద జరిపిన విచారణలో ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 కింద 'హెల్త్ డ్రింక్' గా ఎఫ్ఎస్ఎస్ఐ, మండెలేజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమాలు, నిబంధనలు సరికాదని" అని మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 10 నాటి నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఒక సంవత్సరం క్రితం, బోర్న్విటా, చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడంతో దీనిపై చర్చ మొదలైంది. పానీయం సేవించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయని తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలను తొలగించాలని మోండెలెజ్ ఇండియా యాజమాన్యంలోని బ్రాండ్‌ను నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) కోరింది. పానీయంలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని వీడియో వెలుగులోకి తెచ్చిన తర్వాత బాలల హక్కుల సంఘం ఈ చర్య తీసుకుంది.
బోర్న్‌విటాకు నోటీసులో NCPCR ఈ విషయంపై వివరణాత్మక వివరణ లేదా నివేదికను పంపవలసిందిగా కంపెనీని కూడా కోరింది. బోర్న్‌విటా తనను తాను హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తుందని ఆరోపించిన ఫిర్యాదును స్వీకరించిన తర్వాత NCPCR ఈ చర్య తీసుకుంది.


Click it and Unblock the Notifications