బంగారు ఆభరణాలు, బంగారు కళాఖండాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మూడవ దశ సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. దేశంలో తాజాగా మరో 55 జిల్లాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశామని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో హాల్‌మార్కింగ్‌లో తప్పనిసరి చేసిన మొత్తం జిల్లాల సంఖ్య 343కి చేరుకుంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) జూన్ 23, 2021న మొదటి దశలో దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ని విజయవంతంగా అమలు చేసింది. ఆ తర్వాత రెండవ దశలో, ఏప్రిల్ 4, 2022న అదనంగా 32 జిల్లాల్లో ఈ నిబంధన అమలు చేసింది. తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి నమోదిత నగల వ్యాపారుల సంఖ్య 34,647 నుంచి 181,590కి పెరిగింది. అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాల (AHCలు) సంఖ్య 945 నుంచి 1,471కి పెరిగింది. ఇప్పటి వరకు 26 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు HUIDతో హాల్‌మార్క్ చేశారు.

ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగలిగే బిఐఎస్ కేర్ యాప్‌లో 'వెరిఫై హెచ్‌యుఐడి'ని ఉపయోగించి కొనుగోలు చేసిన హెచ్‌యుఐడి నంబర్‌తో హాల్‌మార్క్ చేయబడిన బంగారు ఆభరణాల ప్రామాణికత, స్వచ్ఛతను ధృవీకరించుకోవచ్చని అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్నేళ్లుగా ఈ యాప్ కు ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. ఈ యాప్ ను 2021-22లో 230,000 మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.24 మిలియన్లకు పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో హాల్ మార్కింగ్ తప్పనిసరి నిబంధన ఉంది. మూడు దశల్లో కలిపి తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 17 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధన అమలులో ఉంది. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ లో హాల్ మార్కింగ్ తప్పనిసరి నిబంధన అమలు అవుతోంది. ఏపీలో అన్నమయ్య, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, నద్యాల, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో హాల్ మార్కింగ్ తప్పనిసరి నింబధన అమల్లో ఉంది.


Click it and Unblock the Notifications