కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 24,657 కోట్ల రూపాయల విలువైన 8 రైల్వే ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆగస్టు 9న ఆమోదం తెలిపింది. గిరిజనుల ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో అభివృద్ధి ప్రక్రియను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ 8 ప్రాజెక్టుల్లో మూడింటిని ఒడిశాలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
అంతేకాకుండా ఈ ప్రాజెక్టులు ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్, తెలంగాణ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేస్తాయన్నారు. ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌ను ఈ ప్రాజెక్టులు సుమారు 900 కి.మీ పెంచుతుందని మంత్రి తెలిపారు.ఈ ప్రాజెక్టుల కింద, తూర్పు సింగ్‌బం, భదాద్రికొత్తగూడెం, మల్కన్‌గిరి, కలహండి, నబరంగ్‌పూర్, రాయగడ), దాదాపు 510 గ్రామాలు, సుమారు 40 లక్షల మంది ప్రజలతో సహా 6 "కాంక్షాత్మక జిల్లాలకు" కనెక్టివిటీని పెంచడానికి 64 కొత్త స్టేషన్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు.

పర్యాటకానికి ప్రోత్సాహాన్ని అందిస్తూ, కొత్త రైల్వే నెట్‌వర్క్ అజంతా గుహలను కలుపుతుందన్నారు. "కొత్త లైన్ ప్రతిపాదనలు ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తాయని అశ్వని వైష్ణవ్ తెలిపారు. భారతీయ రైల్వేలకు మెరుగైన సామర్థ్యాన్ని, సేవా విశ్వసనీయతను అందిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు సమీకృత ప్రణాళిక ద్వారా సాధ్యమైన బహుళ-మోడల్ కనెక్టివిటీ కోసం PM-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫలితమన్నారు.
కొత్త నెట్‌వర్క్‌లు వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, సిమెంట్ వంటి అనేక ఇతర వస్తువుల రవాణాకు కీలకమైన మార్గాలుగా ఉంటాయన్నారు. ఈ ప్రాజెక్టులు 143 MTPA (సంవత్సరానికి మిలియన్ టన్నులు) అదనపు సరుకు రవాణాకు ఉపయోగపడతాయన్నారు. CO2 ఉద్గారాలను 0.87 మిలియన్ టన్నులు తగ్గించడం, చమురు దిగుమతులను 32.2 కోట్ల లీటర్లు తగ్గించడం ద్వారా వాతావరణ లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా, రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ప్రభుత్వం రూ. 1,765.67 కోట్లతో క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ (CPP)ని ఆమోదించింది. దీని ద్వారా ఉత్పాదకతను ప్రభావితం చేసే వైరస్ వ్యాప్తిపై ఉద్యాన పరిశ్రమ ఆందోళనలు పరిష్కారమవుతాయన్నారు. ఈ ప్రాజెక్టులతో రైల్వే కంపెనీలకు లబ్ధీ చేకూరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications