రిలయన్స్ డిజిటల్ ఈ ఏడాది 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్'తో ముందుకు వచ్చింది. అతిపెద్ద, మెరుగైన ఆఫర్లు అందిస్తోంది. కస్టమర్లకు విస్తృత శ్రేణిలోని ఎలక్ట్రానిక్స్ మీద సాటిలేని డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, www.reliancedigital.in లో ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా HDFC డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఈజీ ఇఎమ్ఐ మీద 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కస్టమర్లు సిటి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐ మీద రూ. 4500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కస్టమర్లు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్స్ మీద రూ.2000 ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది. రిలయన్స్ డిజిటల్ నుంచి ఈ పండుగకు బహుమతిగా షాపర్లకు రూ.1000 వరకు విలువైన వోచర్లు లభిస్తాయి. ఈ సేల్స్ 16వ తేదీ వరకు కొనసాగుతాయి.
వివిధ కేటగిరీల్లో ఆఫర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్20తో పాటు వివిధ మొబైల్స్ పైన ఆఫర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 డిస్కౌంట్ ధర రూ.40,999. కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రోలపై ఆఫర్లు ఉన్నాయి. కస్టమర్లు ఐఫోన్ 11ను రూ.2,796 మంత్లీ ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ వాచ్ ఎల్టీఈ (42ఎంఎం) డిస్కౌంట్ ధర రూ.13,950లో లభిస్తుంది. ఇవే కాకుండా వివిధ ఉత్పత్తులపై ఆఫర్లు లభిస్తున్నాయి.

కస్టమర్లకు ఏదైనా రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ లేదా www.reliancedigital.in ద్వారా షాపింగ్ చేయవచ్చు. ఇన్‌స్టా డెలివరీ (3 గంటలలోపు డెలివరీ) ఉంటుంది. తమ దగ్గరలోని స్టోర్‌ను ఎంచకొని స్టోర్ పిక్ అప్ ఆప్షన్ సౌకర్యం ద్వారా పొందవచ్చు.


Click it and Unblock the Notifications