Rapido: రాపిడోకు షాక్.. రూ.10 లక్షల జరిమానా విధించిన సీసీపీఏ..
క్యాబ్, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడోకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA)రూ. 10 లక్షల జరిమానా విధించింది. రైడ్ బుక్ చేసే సమయంలో ప్రయాణికులపై ఎక్కువ డబ్బు చెల్లించేలా ఒత్తిడి తీసుకొచ్చే డిజిటల్ పద్ధతులు ఉపయోగించిందని నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సెంట్రల్ కన్జూమర్ ఫోరం తెలిపింది. రైడ్ బుక్ చేసిన తర్వాత యాప్‌లో రకరకాల మేసేజ్ లను పంపడం ద్వారా కస్టమర్లపై మానసిక ఒత్తిడికి పెంచేలా ఉందని వాచ్ డాగ్ గుర్తించింది. అంటే ఎక్కువ డబ్బు ఇస్తేనే త్వరగా రైడ్ దొరుకుతుందనే భావన కలిగించేలా యాప్ రూపకల్పన చేసినట్లు CCPA పేర్కొంది. రైడ్‌లు ఖరారు కాకముందే ప్రయాణికులను ఎక్కువ చెల్లించేలా ప్రేరేపించడం ఈ డార్క్ ప్యాటర్న్‌లలో భాగంగా ఉంది.
రైడ్‌కు ముందు ఇచ్చే టిప్పింగ్, డైనమిక్ ప్రైసింగ్‌కు సంబంధించిన పద్ధతులను పరిశీలించడానికి, భారతదేశంలో పనిచేస్తున్న క్యాబ్, బైక్-టాక్సీ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లపై CCPA చేపట్టిన రంగవ్యాప్త తనిఖీ నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. వివిధ ప్లాట్‌ఫామ్‌లను తనిఖీ చేస్తున్నప్పుడు, ఒక ప్రయాణికుడి బుకింగ్ ఇంకా ప్రాసెస్ అవుతున్న సమయంలోనే, రాపిడో యాప్ "ధర ఎంత ఎక్కువైతే, రైడ్ దొరికే అవకాశం అంత ఎక్కువ" "కెప్టెన్లు రూ. 60కి అంగీకరించడం లేదు. +10, +20, +30 అదనంగా వేసి ప్రయత్నించండి" వంటి సూచనలను ప్రదర్శిస్తున్నట్లు CCPA కనుగొంది.

రాపిడో అల్గోరిథం మొదట ప్రయాణీకుడికి ఒక ఛార్జీని సూచిస్తుందని, ఆ తర్వాత ప్రయాణీకుడు ఆ ఛార్జీకి బుక్ చేసుకున్నప్పుడు, కెప్టెన్‌లు అసలు ధరను అంగీకరించడం లేదనే కారణంతో ఎక్కువ చెల్లించమని ప్రయాణీకుడిని ప్రేరేపిస్తుందని CCPA కనుగొంది. ప్రయాణీకుడు ఇప్పటికే బుకింగ్‌కు కట్టుబడి, బేరసారాలకు పరిమిత అవకాశం ఉన్న దశలో, అదనపు మొత్తం చెల్లిస్తేనే త్వరగా రైడ్ పొందే అవకాశాలు ఉంటాయనే తప్పుడు అభిప్రాయాన్ని ఈ పద్ధతి సృష్టిస్తుందని CCPA పేర్కొంది. ఈ పద్ధతి "కన్ఫర్మ్ షేమింగ్" కిందకు వస్తుందని నిర్ధారించింది. ఇది "డార్క్ ప్యాటర్న్‌ల నివారణ, నియంత్రణ మార్గదర్శకాలు విరుద్ధమని, 2023 కింద గుర్తించబడిన ఒక డార్క్ ప్యాటర్న్ అని పేర్కొంది.
ఎందుకంటే, వినియోగదారుడు ఎక్కువ చెల్లించడానికి అంగీకరించకపోతే రైడ్ కోల్పోతామనే ఆత్రుతను, భయాన్ని ఇది సృష్టిస్తుందని వివరించింది. CCPA రాపిడో "మీ ధరను నిర్ణయించుకోండి" అనే స్లైడర్‌ను కూడా పరిశీలించింది. ధరను పెంచినప్పుడు "రైడ్ పొందే అవకాశం ఎక్కువ" అని ఆకుపచ్చ రంగులో ప్రదర్శిస్తున్నట్లు తేల్చింది. ధరను తగ్గించినప్పుడు ఎరుపు లేదా నారింజ రంగు హెచ్చరిక వచ్చినట్లు గుర్తించింది. రైడ్-హెయిలింగ్, బైక్-టాక్సీ ప్లాట్‌ఫారమ్‌లలో అడ్వాన్స్-టిప్ మరియు డార్క్-ప్యాటర్న్ పద్ధతులపై CCPA జరుపుతున్న విస్తృత పరిశీలనలో భాగంగానే రాపిడోపై ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
