Zee: జీ మీడియా గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ కేసు..!

జీ మీడియా గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర అప్పుల విషయంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. రూ.22 వేల కోట్ల అప్పుకు రూ.6 కోట్లు చెల్లించవచ్చని ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు తీవ్ర దూమరం రేపింది. ఆ తర్వాత ఐదుగురు సభ్యుల ఎన్సీఎల్టీ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. తాజాగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థకు రూ. వెయ్యి 322 కోట్లకు పైగా బకాయిలు పడిన వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు సుభాష్ చంద్రతో పాటు మరో ముగ్గురిపై కేసు ఫైల్ చేసింది. పంకజ్ సురోలియా, అమిశ్ పాండ్యా, రాజీవ్ ధోలకియా తదితరులపై ఈ మోసం, కుట్ర కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

2018 సంవత్సరంలో సుభాష్ చంద్ర తప్పుడు ఆర్థిక ప్రకటనలు, వివాదాస్పద నెట్‌వర్త్ సర్టిఫికెట్లను సమర్పించి తమను మోసం చేశారని ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ సిబీఐకి ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తన నికర విలువ రూ.59వేల 113 కోట్లుగా పేర్కొంటూ సర్టిఫికెట్‌ను సమర్పించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ డాక్యుమెంట్లను నమ్మిన ఫైనాన్స్ సంస్థ ఆయనకు సంబంధించిన వివిధ కంపెనీలకు భారీగా లోన్స్ మంజూరు చేసినట్లు పేర్కొంది. వసంత్ సాగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, పాన్ ఇండియా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం టేకోవర్ & టాప్-అప్ కింద రూ.500 కోట్ల హోమ్ ఎంట్రీ లోన్ మంజూరు చేశారు.

Zee

ఇందుకు సుభాష్ చంద్ర కంటిన్యూయింగ్ గ్యారంటీ లెటర్ సమర్పించారు. ఈ లోన్ కోసం 'DIM & Co' ద్వారా జూలై 2018 నాటికి ఆయన నికర విలువ సుమారు రూ. 59వేల113 కోట్లుగా చూపించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, స్పిరిట్ ఇన్ఫ్రా పవర్, మల్టీ వెంచర్స్ సంస్థలకు రెంటల్ డిస్కౌంటింగ్ పద్ధతిలో రూ.480 కోట్ల రుణం ఇవ్వగా.. దీనికి 'MPJ & Co' చార్టర్డ్ ఖాతాదారులు జూలై 2018లో జారీ చేసిన రూ.40వేల 562 కోట్ల నికర విలువ సర్టిఫికెట్‌ను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ లోన్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగి ఆయా ఖాతాలు డిఫాల్ట్ అయ్యాయి.

రుణాలు పొందే సమయంలో వేల కోట్ల ఆస్తులున్నట్లు నమ్మించి, తీరా సమస్య వచ్చినప్పుడు తన నికర విలువ అంత లేదని యూటర్న్ తీసుకోవడం స్పష్టమైన మోసం, నేరపూరిత నమ్మకద్రోహం, కుట్ర కిందకు వస్తుందని ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ సీబీఐ హెడ్ ఆఫీసుకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+