Inspiration Story: రూ.6 లక్షల పెట్టుబడిని రూ.50 కోట్ల వ్యాపారంగా మార్చారు.. అదీ చీరలు అమ్మి..
ఒక చిన్న ఆలోచన వారిని పెద్ద స్థాయిలో నిలబెట్టింది. రూ.6 లక్షలతో ప్రారంభించిన వారి వ్యాపారాన్ని రూ.6 కోట్లకు చేర్చింది. ముంబైకి చెందిన 36 ఏళ్ల సుజాత తన సహోద్యోగి 34 ఏళ్ల తానియా ఓ వ్యాపారాన్ని చేయాలనుకున్నారు. చీరల పట్ల మక్కువతో చీరల బిజినెస్ బావుంటుందని నిర్ణయించుకున్నారు.

చెరో మూడు లక్షలు
తమ ఇద్దరి పేర్లలోని సు, త అనే మొదటి రెండు అక్షరాలతో 'సుత' (Suta) సారీ బ్రాండ్‌ని సృష్టించారు. ఒక్కొక్కరు రూ.3 లక్షలు వెచ్చించి రూ.6 లక్షల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టారు. వారిని బ్రాండ్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకున్నారు. ఇలా ఇన్‌స్టాగ్రాంలో పాపులర్ బ్రాండ్‌గా సుత అవతరించింది. అలా అంచెలంచెలుగా విస్తరిస్తూ గత ఏడాది తమ వ్యాపారాన్ని 50 కోట్ల ఆదాయం సాధించే స్థాయికి తీసుకొచ్చారు.

కోల్‌కతా, బెంగుళూరు
ప్రారంభంలో బెంగాల్, ఫూలియా, బిష్ణుపూర్, రాజ్‌పూర్, ధనియాఖలి వంటి గ్రామాలు, ఒరిస్సాతో పాటు చీరలకోసం అవసరమైన ప్రాంతానికి వెళ్లారు. ఇలా అల్మారలో మొదలైన ప్రస్థానం గిడ్డంగిని అద్దెకు తీసుకునేదాకా వెళఅలింది. వీరు త్వరలో కోల్‌కతా, బెంగుళూరు భౌతికంగా దుకాణలను ప్రారంభించాలని భావిస్తున్నారు.

స్టడీ చేయాలి
తమ దగ్గర చీరలు సాధారణంగా రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ఉంటాయని వివరించారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్‌ను బాగా స్టడీ చేయాలని సూచిస్తున్నారు. ఇంజినీర్లుగా పని చేస్తూ ఏదో ఒకటి చేయాలనుకున్నాం. అందుకే ఈ వ్యాపారాన్ని ప్రారంభించామని చెబుతున్నారు సుజాత, సుజాత. వీరి వ్యాపారం మరింత వృద్ధి చెందాలని మనం కూడా కోరుకుందాం.


Click it and Unblock the Notifications