Bikaji Foods IPO: బికాజీ ఫూడ్స్ ఐపీవో.. గ్రే మార్కెట్‍లో రూ.71 ప్రీమియంతో ట్రేడవుతున్న స్టాక్..
స్నాక్స్, స్వీట్లను తయారు చేసే సంస్థ అయిన బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ IPO గురువారం నుంచి ప్రారంభం అయింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS). ఈ ఇష్యూలో ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు తమ వాటాను విక్రయిస్తున్నారు. నవంబర్ 7 బికాజీ ఫుడ్స్ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. బికాజీ ఫుడ్స్ ఐపీవో ధర ఒక్కో షేరుకు రూ. రూ. 285 నుండి రూ. 300 వరకు నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా 881.2 కోట్లను సమీకరించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఐపీఓ కింద ఆఫర్ ఫర్ సేల్ కింద 2.94 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
ఒక్క లాట్ లో 50 షేర్లు
బికాజీ ఫుడ్స్ ఐపీఓలో పెట్టుబి పెట్టాలంటే కనీసం రూ.15 వేలు పెట్టుబడి పెట్టాలి. ఒక్క లాట్ లో 50 షేర్లు వస్తాయి. ఒక్క షేరు రూ.300 లతో మొత్తం 50 షేర్లకు రూ.15,000 అవుతాయి. బికాజీ ఫుడ్స్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.262.11 కోట్లు సమీకరించగా, ఒక్కో షేరుకు రూ.300 చొప్పున షేర్లను కేటాయించారు. మొత్తం 87.37 లక్షల షేర్లను కేటాయించారు. ఈ రోజు గ్రే మార్కెట్‌లో బికాజీ ఫుడ్స్ షేర్లు రూ. 71 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.

భుజియా
ఐపీఓలో వచ్చిన వారికి నవంబర్ 11, 2022న బికాజీ ఫుడ్స్ షేర్ల కేటాయిస్తారు. బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేర్లను 16 నవంబర్ 2022న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి.బికాజీ ఫుడ్స్ కంపెనీలో 250 కంటే ఎక్కువ రకాల పదార్థలు తయారు చేస్తున్నారు. ఉత్తర భారతదేశం నుంచి ఈశాన్య భారత్ వరకు వీరికి మార్కెట్ ఉంది. కంపెనీ భుజియా, నమ్‌కీన్, ప్యాక్డ్ స్వీట్స్ నుంచి పాపడ్, ఫ్రోజెన్ ఫుడ్, కుకీల వరకు తయారు చేస్తుంది.
Note: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబుడలు పెట్టేటప్పుడు నిపుణులతో సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications