Bengaluru News: బెంగుళూరు వాసులకు శుభవార్త.. 2027లో అందుబాటులోకి అవుటర్ రింగ్ రోడ్ మెట్రో కారిడార్..!
ఫేజ్ 2ఏ కింద చేపట్టిన అవుటర్ రింగ్ రోడ్ మెట్రో కారిడార్ 2027 మధ్య నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెల రోజుల్లోగా దొడ్డనెకుండి దాటి మరో నాలుగు స్టేషన్ల వరకు ట్రయల్ రన్‌లను విస్తరిస్తామని గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ తెలిపారు. ఫిబ్రవరి నాటికి ఆటోమేటిక్ సిగ్నలింగ్ పనులు పూర్తవుతాయని, మార్చి నుంచి భద్రతా ధృవీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 19.75 కిలోమీటర్ల పొడవైన కేఆర్ పుర - సిల్క్ బోర్డ్ మార్గాన్ని ఏడు నుంచి ఎనిమిది నెలల్లోగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఫేజ్ 2ఏలో మొత్తం 13 స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం బైయప్పనహళ్లి డిపో నుంచి కేఆర్ పుర, సరస్వతి నగర్, డీఆర్డీఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్, దొడ్డనెకుండి అనే నాలుగు స్టేషన్ల పరిధిలోని 6.5 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్ రన్‌లు జరుగుతున్నాయి.
అదే సమయంలో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఉండే అవుటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాంతానికి ఈ 'బ్లూ లైన్'కనెక్టివిటి ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2021 జూలైలో ఫేజ్ 2ఏకు ఆమోదం తెలపగా.. అదే ఏడాది సెప్టెంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇక కేఆర్ పుర నుంచి హెబ్బాల్ మీదుగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిపే 38.44 కిలోమీటర్ల ఫేజ్ 2బీ (Phase 2B) ప్రాజెక్టుకు సంబంధించి, కేఆర్ పుర - హెబ్బాల్ మార్గంలో పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మొత్తం 58.19 కిలోమీటర్ల పొడవైన ఈ 'బ్లూ లైన్'ను 18 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

అలాగే గత 22 నెలలుగా కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం వేచి చూస్తున్న 'రెడ్ లైన్' (ఫేజ్ 3ఏ) గురించి కూడా రాష్ట్ర అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. రెడ్ లైన్‌లోని రెండు ఎలివేటెడ్ మార్గాలైన సర్జాపూర్-ఇబ్లూర్ (14 కి.మీ.), అగారా-కోరమంగళ 3వ బ్లాక్ (2.45 కి.మీ.) వెంబడి రోడ్డు ఫ్లైఓవర్లను కలుపుకొని డబుల్ డెక్కర్ వయాడక్ట్ నిర్మాణానికి కర్ణాటక కేంద్రం ఆమోదం కోరింది. ప్రస్తుతం BMRCLకు నిర్వహణ మిగులు ఉన్నప్పటికీ, వ్యవస్థ పాతబడటం మరియు పరికరాలను మార్చాల్సిన అవసరం ఏర్పడటంతో వార్షిక నష్టం రూ. 600-700 కోట్లకు పెరగే అవకాశం ఉంది. బీఎంఆర్సీఎల్ వార్షిక నివేదిక ప్రకారం 2025-26లో నష్టం రూ. 576.79 కోట్లుగా ఉంది. మరిన్ని లైన్లు ప్రారంభమయ్యే కొద్దీ నిర్వహణ వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది.
రుణాల చెల్లింపులు, నిర్వహణ నగదు నష్టాలు, నిర్మాణ వ్యయ పెరుగుదలలు, మారకపు రేటు హెచ్చుతగ్గుల భారాన్ని కర్ణాటకే భరిస్తోంది. రుణాలు తీసుకున్నప్పుడు డాలర్ విలువ సుమారు రూ. 70-80 ఉండగా అప్పటి నుంచి అది దాదాపు రూ. 100కి పెరిగిందని, దీంతో రుణ భారం దాదాపు 30% పెరిగిందని మంత్రిి తెలిపారు. బీఎంఆర్‌సీఎల్ ఆర్థిక వ్యయం 2024-25లో రూ. 560.91 కోట్ల నుంచి 2025-26 నాటికి రూ. 1,793.03 కోట్లకు పెరిగింది. 39.2 కిలోమీటర్ల కారిడార్‌లో 37.1 కిలోమీటర్ల మేర ట్రాక్ వేయడం పూర్తయింది. థర్డ్-రైల్ ఏర్పాటు, స్టేషన్ విద్యుత్ పనులు, కేబుల్ వేయడం జరుగుతున్నాయి. అన్ని స్టేషన్లలో సహాయక ఉప స్టేషన్లు (ASS), ట్రాక్షన్ ఉప స్టేషన్లు (TSS) ప్రారంభించనున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications