Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి ఎక్స్ ప్రెస్ వే..

262 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. తమిళనాడులోని అరక్కోణం నుంచి కాంచీపురం మధ్య ఉన్న 25.5 కిలోమీటర్ల మార్గం పూర్తి కావాల్సి ఉంది. ఇది కూడా త్వరలో పూర్తి చేయనున్నారు. దీంతో బెంగళూరు, చెన్నై వాసులకు ఈ ఎక్స్ ప్రెస్ వే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ఎక్స్ ప్రెస్ వేపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. బెంగళూరు వైపు నుంచి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆంధ్రప్రదేశ్‌లోని బైరెడ్డిపల్లి వరకు 96.7 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేసి వాహనాల రాకపోకలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే 31 కిలోమీటర్ల బైరెడ్డిపల్లి-బంగారుపాలెం విభాగంలో 93 శాతం పనులు పూర్తయ్యాయి.

ఆ తర్వాతి గుడిపాల వరకు ఉన్న 29 కిలోమీటర్ల మార్గంలో పూర్తి పనులు, వాలాజాపేట వరకు ఉన్న దాదాపు 24 కిలోమీటర్ల మార్గంలో 99 శాతం పనులు ,24.5 కిలోమీటర్ల వాలాజాపేట-అరక్కోణం విభాగంలో 98 శాతం పనులు పూర్తయ్యాయి. చివరి రెండు విభాగాల్లో మిగిలిన పనులు ఆగస్టు 31 నాటికి పూర్తవుతాయని కేంద్ర రహదారుల శాఖ పార్లమెంటుకు తెలిపింది. కాంచీపురం-శ్రీపెరంబదూర్ మధ్య ఉన్న 31 కిలోమీటర్ల మార్గంలో NHAI 90 శాతం పనులు పూర్తి చేసినప్పటికీ, అత్యంత కీలకమైన 25.5 కిలోమీటర్ల అరక్కోణం-కాంచీపురం ప్యాకేజీలో మాత్రం కేవలం 53 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

Bengaluru Chennai Express way

భూసేకరణలో జాప్యం, విద్యుత్ వ్యవస్థల తరలింపు, ఎక్స్‌ట్రా హై-టెన్షన్ టవర్లు, రైల్వే పవర్ బ్లాక్‌ల మంజూరు, రైల్వే స్విచింగ్ పోస్ట్‌ల తరలింపు వంటి సమస్యల వల్ల తమిళనాడులోని ప్రాజెక్ట్ ప్యాకేజీలన్నీ నిలిచిపోయాయని తెలిపారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, తమిళనాడు ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన టవర్ల తరలింపు మినహా మిగిలిన సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. అయితే కాంట్రాక్టర్‌కు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అరక్కోణం-కాంచీపురం ప్యాకేజీ పనులు నిలిచిపోయాయి. NHAI నవంబర్ 10న కాంట్రాక్ట్ రద్దు నోటీసు జారీ చేసినప్పటికీ, కాంట్రాక్టర్ హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులను పొందారు. ఈ కేసులో కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.

కాంట్రాక్టుదారుని మార్చేందుకు తమ హక్కును వినియోగించుకునే ప్రక్రియను ప్రధాన రుణదాతలు ప్రారంభించారని గడ్కరీ తెలిపారు. కోర్టు నుంచి అనుమతి అందిన తర్వాత ఆరు నెలల్లోగా ఈ ప్యాకేజీని పూర్తి చేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. కాగా ఈ ఎక్స్ ప్రెస్ వే అందుబాటులోకి వస్తే కేవలం 3 గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నై చేరుకోవచ్చు. ఈ జాతీయ రహదారి వల్ల తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం పొందన్నాయి. ఈ ఎక్స్ ప్రెస్ వేలో అందుబాటులోకి వచ్చిన రోడ్డుపై రాకపోకలు కొనసాగుతున్నాయి. ఓ వాహనదారుడు ఈ రహదారి గురించి సోషల్ మీడియా పోస్ట్ చేశారు.

తాను బెంగళూరు (వైట్‌ఫీల్డ్)లో నివసిస్తున్నానని, తరచుగా చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న తన ఇంటికి ప్రయాణిస్తుంటానని చెప్పారు. బంధువులను కలవడానికి గత వారం చెన్నైకి వెళ్లినట్లు చెప్పారు. ఉదయం 4:45 గంటలకు ఇంటి నుంచి బయలుదేరినట్లు వివరించారు. గంటకు 115 కి.మీ వేగంతో ప్రయాణం చాలా సాఫీగా సాగిందని వివరించారు. బైరెడ్డిపల్లె నుంచి పలమనేరు వరకు ఉన్న 17 కి.మీ దూరం కొంత ట్రాఫిక్ ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+