Bengaluru: గుడ్ న్యూస్.. ఉత్తర బెంగళూరులో సొరంగ మార్గంతో తగ్గనున్న ట్రాఫిక్

ఉత్తర బెంగళూరులో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఇక్కడ ఆఫీసులు, కొత్త ఇళ్లు, రెస్టారెంట్లు, వినోద సముదాయాలు ఉండండతో భారీగా వాహనాలు తిరుగుతున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ ట్రాఫిక్ ను తగ్గించేందుకు బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ(BDA) చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఉత్తర బెంగళూరులో సొరంగం నిర్మించాలనుచుంటుంది. ఈ సొరంగం పూర్తయితే ప్రజలు నగరంలోని కొన్ని ప్రాంతాలకు త్వరగా ప్రయాణించనున్నారు.

ఈ సొరంగాన్ని 4.5 కిలోమీటర్ల నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. ఈ సొరంగం రాజాజీనగర్‌లోని డాక్టర్ రాజ్‌కుమార్ మెమోరియల్‌ని ఉత్తర బెంగళూరులోని BEL సర్కిల్‌కు కలుపుతుంది. ఈ సొరంగం నార్త్ బెంగుళూరును కనెక్ట్ చేయడంలో ఉపయోగపడనుంది. ఇది నగరంలో జరుగుతున్న ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో కూడా బాగా పని చేస్తుంది. కొంత ట్రాఫిక్‌ను భూగర్భంలోకి తరలించడం ద్వారా, ప్రయాణాన్ని వేగవంతం చేయాలని, కూడళ్లలో ట్రాఫిక్‌ను తగ్గించాలని బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ భావిస్తోంది. ఈ సొరంగం రాజాజీనగర్‌లోని డాక్టర్ రాజ్‌కుమార్ మెమోరియల్ నుంచి ప్రారంభమై బీఈఎల్ సర్కిల్ వద్ద ముగుస్తుంది.

Tunnel

ఈ సొరంగం డా. రాజ్‌కుమార్ మెమోరియల్, రాజాజీనగర్, యశ్వంతపూర్, మతికెరె, కొత్త BEL రోడ్, BEL రోడ్, BEL సర్కిల్, హెబ్బల్ వరకు ఉంటుంది. రాజాజీనగర్ భూగర్భ సొరంగం ద్వారా ఉత్తర బెంగళూరుకు 8-10 నిమిషాలు వేగంగా చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. సొరంగం వల్ల యశ్వంత్‌పూర్ ప్రధాన జంక్షన్‌లలో 6-8 నిమిషాలు రద్దీ తగ్గుతుందని వివరిస్తున్నారు. మతికెరె నుంచి BEL సర్కిల్ వైపు 5-7 నిమిషాల్లో చేరుకుంటారని చెబుతున్నారు. ప్రతిపాదిత భూగర్భ సొరంగం ఉత్తర బెంగళూరు చుట్టూ తిరగడాన్ని సులభతరం చేయనుంది.

రాజాజీనగర్, యశ్వంత్‌పూర్, మత్తికెరె, బీఈఎల్ రోడ్ మరియు హెబ్బాల్ వంటి ప్రదేశాలలో ఆస్తుల విలువలు పెరగడానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడే అవకాశం ఉంది.
కొత్త భూగర్భ సొరంగం ఇప్పటికీ ఒక ప్రతిపాదన మాత్రమే BDA దీనిని నిర్మించడానికి ముందు ప్రభుత్వం ఆమోదం అవసరం. నిధులు కూడా కావాలి. ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత నిధులు కేటాయించాలి. డీపీఆర్ తయారు చేయాలి, భూసేకరణ చేయాలి. ఆ తర్వాత పనులు ప్రారంభించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+