Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్.. నవంబర్ 30న ఆటోల బంద్..
మహాత్మా గాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నవంబర్ 30న హైదరాబాద్‌లో ఒక రోజు బంద్‌కు పిలుపునిచ్చింది. 15 రోజుల్లోగా సవరించిన ఆటో మీటర్ ఛార్జీలను అమలు చేయాలని, లేకపోతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలన్నారు. నవంబర్ 15, ఆదివారం నాడు హైడర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమానుల్లా ఖాన్ మాట్లాడారు. గ్రీన్ క్యాబ్‌లు తమ జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆరోపిస్తూ, వాటిపై తక్షణమే నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఆటో బ్లాక్ మార్కెట్ రాకెట్‌పై ఉక్కు చర్య తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున మొత్తం రూ.36,000 చెల్లించాలని కూడా కమిటీ డిమాండ్ చేశారు. బెంగళూరులో మాదిరిగా నగరంలో కూడా ద్విచక్ర వాహన ట్యాక్సీలను నిషేధించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్‌లో దాడికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ ముకరం కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించాలని కూడా ఈ సంస్థ కోరింది. అంతకుముందు, ఈ సంఘం ఆగస్టులో సమ్మెను ప్రకటించింది. కానీ రవాణా శాఖ మంత్రితో సమావేశం అనంతరం దానిని విరమించుకుంది. పొన్నం ప్రభాకర్ తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించారని జేఏసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఉచిత బస్సుల వల్ల తమ ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని ఆటో డ్రైవర్లు పేర్కొంటున్నారు. అందరు బస్సు ఎక్కి వెళ్లిపోవడం వల్ల ఇప్పుడు ఆటోలు ఎవరు ఎక్కడం లేదన చెబుతున్నారు. బస్సులు లేని ఏరియాల్లో మాత్రమే గిరాకీ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్యాక్సీలు వస్తే అందరూ తక్కువ ధరలో వచ్చే ట్యాక్స్ లు బుక్ చేసుకుంటారని.. ఫలితంగా తమ ఉపాధి మరింత దెబ్బతింటుందని చెబుతున్నారు. జిల్లా రిజిస్ట్రేషన్ ఆటోలను హైదరాబాద్ తిప్పుతున్నారని తెలిపారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే చాలా మంది ఆటో డ్రైవర్లు ఎక్కువ ధరలు తీసుకుంటున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications