Mutual Funds: మ్యూచువల్ ఫండ్ యూనిట్ల బదిలీపై కీలక నిర్ణయం..!

ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. చాలా మంది చిన్న మొత్తంలోనైనా ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు తప్పుకూడా నామినీని యాడ్ చేయాలి. నామినీ యాడ్ చేయడం వల్ల భవిష్యత్ యూనిట్ హోల్డర్ మరణించిన తర్వాత నామినీకి ఫండ్లు బదిలీ అవుతాయి. అయితే మ్యూచువల్ ఫండ్ల యూనిట్లు బదిలీని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సులభతరం చేసింది.

చిరునామాలో తేడాలు వంటి చిన్నపాటి వ్యత్యాసాల ఉన్నా, మరణించిన వారి లబ్ధిదారులు, కుటుంబాలు ఈ యూనిట్లను వారసత్వంగా పొందేటప్పుడు ఎలాంటి ఆటంకాలు ఎదుర్కోకుండా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ చర్యలు తీసుకుంటుంది. యూనిట్ హోల్డర్ పేరు లేదా సంతకంలో వ్యత్యాసాలు ఉన్న సందర్భాలలో, ఈ సమస్యకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) అందించినటువంటి ఫ్రేమ్‌వర్క్‌నే అనుసరించాలని మ్యూచువల్ ఫండ్ నియంత్రణ సంస్థ AMCsకి సూచనలు జారీ చేసింది.

Mutual Fund

స్వల్ప వ్యత్యాసాలు ఉన్న సందర్భంలో ఏఎంసీలు (AMCs) బదిలీ అభ్యర్థనను ప్రాసెస్ చేయాలని తెలిపింది. అదే సమయంలో ఆ వ్యత్యాసం గురించి యూనిట్ హోల్డర్‌కు తెలియజేయాలని పేర్కొంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి సంబంధిత వ్యక్తికి 15 రోజుల గడువు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత, సంబంధిత వ్యక్తి లేదా లబ్ధిదారుడు ఇన్వెస్టర్ సర్వీస్ రిక్వెస్ట్ ఫారం ద్వారా గానీ, లేదా యూనిట్లను బదిలీ చేస్తున్న కంపెనీ కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా గానీ తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి.

క్లెయిమ్ ప్రక్రియ సమయంలో ముఖ్యంగా పత్రాలలో స్వల్ప వ్యత్యాసాల కారణంగా, ఇప్పటికే దుఃఖంలో ఉన్న కుటుంబాలు ఎదుర్కొంటున్న పరిపాలనాపరమైన ఇబ్బందుల గురించి ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో ఏఎంఎఫ్ఐ ఈ మార్పులను తీసుకువచ్చింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని అన్ని సభ్య ఏఎంసీలకు ఇప్పటికే తెలియజేసినట్లు వెల్లడించింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+