Thalliki Vandanam: గుడ్ న్యూస్.. వచ్చే వారమే బ్యాంకు ఖాతాల్లో రూ.13 వేలు జమ..!
విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. ఈ సంవత్సరం తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు ఇచ్చే రెండో విడత తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి రూ.13 వేలు అందించనున్నారు. తొలి విడత నిధుల విడుదల తర్వాత కొత్తగా పాఠశాల, కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్ధుల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన అధికారులు లబ్ధిదారుల సంఖ్యను ప్రకటించారు. వారికి ఇవ్వాల్సిన నిధుల విడుదలపై ప్రభుత్వం శనివారం జీవో కూడా జారీ చేసింది.
తల్లికి వందనం పథకం రెండో విడతలో భాగంగా 3,29,201 మందికి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇది మొదట అనుకున్నదాని కంటే 58,601 మంది విద్యార్థులు ఎక్కువ. పెరిగిన సంఖ్యకు అనుగుణంగా నిధుల మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా సంఖ్యతో కలిపి ఈ విద్యా సంవత్సరంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 67,47,190 నుంచి 68,05,791కు చేరింది. దీని వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. తల్లికి వందనం పథకం కింద రెండు దశల్లో కలిపి మొత్తం రూ.10,208.69 కోట్లు ఖర్చు చేయనున్నారు. రెండో విడత లబ్ధిదారులకు త్వరలోనే నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.

తొలి దశలో ఒకటో తరగతి, ఇంటర్ మొదటి ఏడాదిలో చేరాల్సిన వారు, రికార్డులు సక్రమంగా లేనివారు మినహా మిగిలిన 64,76,590 మందికి నిధులు విడుదల చేశారు. రెండో విడతకు సంబంధించి ఆగస్టు 30న విడుదల చేయాల్సి ఉండే.. కానీ కొన్ని కారణాలతో ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అయితే దసరా లోపు రెండో విడత తల్లికి వందనం నిధులు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 3.30 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వచ్చే వారం ఈ నిధుల జమకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి రూ.10 వేల కోట్లకు పైగా నిధుల విడుదల చేసేందుకు ఆర్ధిక శాఖ నుంచి అనుమతి వచ్చింది.
దాదాపుగా వచ్చే వారం తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదల చేసే అవకాశం ఉంది. నిధులు తల్లుల ఖాతాల్లో జమ కావాలంటే.. విద్యార్థి, తల్లి ఆధార్, ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ, ఆధార్ లింకింగ్, పాఠశాల లేదా కళాశాల వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అన్నీ సరిగా ఉంటెనే వచ్చే వారం వీరి ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంత మంది పిల్లులు ఉంటే.. అంత మందికి అమలు చేస్తున్నారు. ఉదాహరణకు ముగ్గురు పిల్లలు ఉంటే వారికి రూ.39 వేలు జమ కానున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications