Annadata Sukhibhava: రైతులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేలు జమ..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేసింది. పీఎం కిసాన్ 24వ విడత రూ.2 వేలు కలుపుకుని అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేలు జమ చేసింది. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో రెండో విడతగా రాష్ట్ర వాటాగా రూ.2,234.03 కోట్ల నగదును విడుదల చేసింది. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు 24 గంటలల్లో వ్యవధిలోనే 99.44 శాతం మంది రైతుల ఖాతాలో ఈ ఆర్ధిక సాయం జమ కానుంది.కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రూ.2 వేలు జమ చేయగా.. కూటమి ప్రభుత్వం రూ.5 వేలు రిలీజ్ చేసింది. అర్నబ్ తుఫాన్ క్రమంలో పంటకు నష్టం జరిగిన పరిస్థితుల్లో రైతులకు ఈ ఆర్ధిక సాయం ఎంతో ఉపయోగపడనుంది.
రాష్ట్రంలో 46,85,838 మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు జమ అయినట్లు తెలుస్తోంది. వివిధ సాంకేతిక కారణాలతో కేవలం 17,828 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదని సమాచారం. త్వరితగతిన సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి మిగిలిన రైతులకూ ఈ నిధులు విడుదల చేయనున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రత్యేక కార్యక్రమాలు, సభలు లేకుండా ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేశారు. ఇక 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులను జూన్ 20న చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలోని 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్ల ఆర్థిక సాయం అందించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు, కేంద్ర వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందులో కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు అందిస్తుండగా.. కూటమి ప్రభుత్వం రూ.14 వేలు చెల్లిస్తోంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని గత ఏడాది ఆగస్టులో ప్రారంభించారు. గత ఆర్ధిక సంవత్సరం 2025-26లో కేంద్ర, రాష్ట్ర వాటా కలిపి రూ.8,895 కోట్లు రైతులకు చెల్లించారు. ఈ రోజు విడుదల చేసిన నగదుతో కలిపి రూ.రూ.15,236.35 కోట్లు చెల్లించారు. ఇక పీఎం కిసాన్ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు విడుదలల చేస్తున్నారు.
తెలంగాణలో పీఎం కిసాన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా సంవత్సరంలో ఎకరాకు రూ.12 వేలు అందిస్తోంది. సీజన్ రూ.6 వేల చొప్పున రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. త్వరలో యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా విడుదల చేయాల్సి ఉంది. దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications