సాధారణంగా మనం అమెజాన్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే వచ్చే కార్టన్ బాక్స్ ఏమైపోతుందో పెద్దగా గుర్తుండదు. ఇప్పుడు ఆ బాక్స్ కేవలం డెలివరీ కోసం కాదు, ఓ ప్రత్యేకమైన ప్రచార మాధ్యమంగా మారింది. దేశవ్యాప్తంగా రోజూ లక్షల డెలివరీలు చేస్తోంది. ఆ బాక్స్‌లపై సినిమా ప్రకటనలు ఉంటే, అవి ఒక్క ఒక్క ఇంటికీ నేరుగా సినిమాపై గుర్తింపు తీసుకెళ్తాయి. టీవీ, మొబైల్ యాడ్స్ కన్నా ఇది వ్యక్తిగతంగా చేరే ప్రకటన. ఎందుకంటే, సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా 'కూలీ' కోసం అమెజాన్ డెలివరీ బాక్సులనే ప్రకటనల బోర్డుల్లా ఉపయోగిస్తున్నారు.

రజినీకాంత్ 'కూలీ' మూవీకి ఇది ఇండియాలో తొలిసారిగా అమెజాన్ బాక్స్ యాడ్ ఫార్మాట్‌ను ఉపయోగించడం. ప్రపంచంలో ఇంతకు ముందు Minions, Star Wars వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ మాత్రమే ఇలా చేసాయి. ఇప్పుడు మన రజినీకాంత్ సినిమాకు కూడా అదే స్థాయి ప్రచారం జరుగుతోంది.
ఐడియా ఏమిటంటే...
ఈ ఐడియా చాలా సింపుల్ ఆన్‌లైన్‌లో మనకు వస్తున్న ప్రతి అమెజాన్ డెలివరీ బాక్స్ మీద సినిమా ప్రమోషన్ ముద్రించడం. ఇంట్లోకి వచ్చేది బాక్స్ కాదు ఒక "సినిమా ప్రమోషన్". ఇవి పోస్టర్లలా కాకుండా, ఫ్యాన్స్‌కి ప్రత్యేకంగా ఉంచుకోవాలనిపించే విధంగా తయారు చేశారు. ఇంట్లో పెట్టుకున్నా వినూత్నంగా అనిపించేలా. పైగా దీనిపై QR కోడ్ కూడా ఉంటుంది. స్కాన్ చేస్తే ట్రైలర్ వచ్చేస్తుంది.
బాక్స్‌పై ఉండే QR కోడ్ స్కాన్ చేస్తే, సినిమా ట్రైలర్ డైరెక్ట్‌గా తెరపైకి వస్తుంది. ఇలా ప్రింటెడ్ మెసేజ్‌ని డిజిటల్ అనుభూతిగా మార్చడం అనేది క్రియేటివ్‌గా చాలామందిని ఆకట్టుకుంటోంది. యాడ్ స్కిప్ చేస్తే గుర్తుండదు, కానీ ఈ బాక్స్‌లు రోజుకు కనీసం 2-3 సార్లు మన కళ్లకు పడతాయి. అలా సినిమా టైటిల్, లుక్ మన మెదడులో నిలిచిపోతుంది. ఒక్క సినిమా ప్రమోషన్‌కి కాకుండా, FMCG బ్రాండ్లు, వెబ్‌సిరీస్‌లు, సంగీత ఆల్బమ్‌లు కూడా ఇలా ప్రచారం చేసుకోవచ్చు. ఇదే ఫార్మాట్‌ను భవిష్యత్తులో చాలా బిజినెస్‌లు అనుసరిస్తాయి.
ఈ ఫార్మాట్ వల్ల బ్రాండ్‌లు వాటి టార్గెట్ కస్టమర్ల ఇంటి వరకూ నేరుగా చేరవచ్చు. ఇది టీవీ, సోషల్మీడియా లాంటి ప్లాట్‌ఫామ్‌ల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ప్రచారం చేసే మార్గం. ఇలాంటి బాక్స్‌లు అందరికీ నచ్చేలా ఉండటంతో, వాటిని చాలామంది శుభ్రంగా దాచుకుని ఉంచుతారు. దీని వల్ల బ్రాండ్ గుర్తింపు రోజులు, వారాల పాటు మిగిలిపోతుంది. ప్రాంతీయ భాషల్లో ప్రచారం చేస్తే దేశంలోని ప్రతి మూలకూ బ్రాండ్ చేరవచ్చు. ఇది ప్రాంతీయ మార్కెట్‌లలో లోతుగా బలపడే అవకాశాన్ని ఇస్తుంది.
ఈ బాక్సులు ప్రాంతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని డిఫరెంట్ వెర్షన్లలో వస్తున్నాయి:
తెలుగు - రజినీకాంత్ + నాగార్జున
తమిళం - రజినీకాంత్ + సత్యరాజ్
హిందీ - రజినీకాంత్ + ఆమిర్ ఖాన్
కన్నడ - రజినీకాంత్ + ఉపేంద్ర
మలయాళం - రజినీకాంత్ + సౌబిన్
ఇవి చూసినవాళ్లంతా తమ తమ భాషల హీరోలతో ఈ బాక్సులను గుర్తుపెట్టుకుంటారు. ఈడి పక్కా లొకల్ టచ్. ఇది స్కిప్ చేయలేరు యూట్యూబ్ యాడ్ కాదు బాక్సే వస్తుంది ఇంటికి ప్రతి ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న అమెజాన్ ప్యాకేజింగ్.
ఫ్యాన్స్ స్టోరీలు షేర్ చేస్తారు: "ఇది నాకు వచ్చింది!" అని సోషల్ మీడియాలో ఉత్సాహంగా పోస్ట్ చేస్తున్నారు. బాక్సును వదిలిపెట్టలేం ఎందుకంటే అది ఇప్పుడు ఓ సినిమాతో మమేకమై ఉంది అని చెప్పుకొచ్చారు. ఈ బాక్స్‌లు ఫోటోస్, రీల్స్, అన్‌బాక్సింగ్ వీడియోస్ రూపంలో యూజర్ల చేతుల మీదుగా స్వయంగా సోషల్ మీడియాలో పంచబడతాయి. ఇలాంటి యూజర్ జనరేటెడ్ కంటెంట్ (UGC) కంపెనీకి ఉచిత ప్రచారంగా పనిచేస్తుంది.
ఇప్పటివరకూ ఇలాంటి యాడ్ స్టైల్ మన దేశంలో కనపడలేదు కానీ ఇప్పుడు మన కళ్ల ముందే జరుగుతోంది. ఈ బాక్స్ చూస్తే యాడ్ చూసిన ఫీలింగ్ కంటే, ఒక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినట్టు ఉంటుంది. ఇది వైరల్, వినూత్నం, విలువతో కూడిన ప్రచారం.
రజినీకాంత్ 'కూలీ' బాక్స్ వచ్చిందంటే ప్రత్యేకమే! మీరు దాన్ని ఓ గుర్తుగా దాచుకుంటారు. ఇదేంటి యాడ్‌నా గిఫ్ట్‌నా అనిపించేలా ఉన్న ఈ ప్రచారం, సినిమాకు మరింత పబ్లిసిటీ తెచ్చేలా మారింది. అటు ఫ్యాన్స్‌కు గర్వం ఇటు మార్కెటింగ్‌కి మెరుపు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications