న్యూఢిల్లీ: వస్తు, సేవా పన్ను కౌన్సిల్ (GST Cuncil) మరోసారి సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సారథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. ఇది 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (47th GST Council meeting). దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో జీఎస్టీ కౌన్సిల్ భేటీ కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

శ్రీనగర్ వేదికగా..
ఈ నెల 28, 29వ తేదీల్లో జీఎస్టీ మండలి సమావేశం కాబోతోంది. ఈ విషయాన్ని నిర్మల సీతారామన్ తెలిపారు. ఈ సారి ఈ సమావేశానికి జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు దీనికి హాజరు కానున్నారు. పెట్రోల్, డీజిల్ సహా వంటనూనెలు, పప్పు దినుసులు, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో జీఎస్టీ మండలి సమావేశం కాబోతోంది. ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయనేది ఆసక్తి రేపుతోంది.

అదుపు తప్పిన ద్రవ్యోల్బణం..
దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిన విషయం తెలిసిందే. రిటైల్, హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ అంచనాలకు మించి పెరిగింది. ఏప్రిల్‌లో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) 15.8 శాతంగా నమోదు కాగా.. మే నాటికి భారీగా పెరిగింది. 15.88 శాతానికి చేరింది. గత సంవత్సరం అంటే 2021 మే నెలతో పోల్చుకున్నా కూడా ఈ సంఖ్య చాలా ఎక్కువ.

గతంలో కంటే
గత ఏడాది మే నెలలో నమోదైన డబ్ల్యూపీఐ 13.11 శాతమే. సరిగ్గా సంవత్సరం తిరిగే సరికి పైకెళ్లి కూర్చుంది. 15.88 శాతంగా నమోదైంది. తొమ్మిది సంవత్సరాల గరిష్ఠానికి చేరుకుంది. 2013లో డబ్ల్యూపీఐ 15 శాతానికి పైగా నమోదైంది. ఇప్పుడు దాన్ని అధిగమించింది. మే నెలలో దాదాపు అన్నింటి ధరలు పెరగడమే దీనికి కారణమని ఆర్థికవేత్తలు అంచనా వేస్తోన్నారు.

ధరల పెరుగుదల..
కొన్ని నెలలుగా వంటనూనెలు, పప్పు దినుసులు.. ఇతర నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. వంటనూనెల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న సందర్భాలు లేకపోలేదు. ఏది ముట్టుకున్నా షాక్ కొట్టేంత స్థాయికి ధరలు చేరుకున్నాయి. టమోటా ఇతర కూరగాయల రేట్లు సైతం అదే స్థాయిలో ఉంటోన్నాయి.

రిటైల్ ద్రవ్యోల్బణం..
దీనివల్ల మే నెలలో డబ్ల్యూపీఐ అంచనాలకు మించి పెరిగిందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే పరిస్థితి జూన్‌లో కూడా ఉండొచ్చని అంటున్నారు. ఈ నెలకు సంబంధించిన డబ్ల్యూపీఐ జులైలో వెల్లడవుతుంది. ఏప్రిల్‌లో వ్యవసాయం, గ్రామీణ కార్మిక రంగాల్లో ద్రవ్యోల్బణం 6.44, 6.67 శాతం మేర పెరిగింది. ఇదివరకు వ్యవసాయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09, గ్రామీణ కార్మిక రంగంలో 6.33 ఉండేది.

స్లాబుల్లో సవరణలు..
ఈ పరిణామాల మధ్య 47వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఏర్పాటు కావడం పట్ల అందరి చూపు దానిపైనే నిలిచింది. ప్రస్తుతం ఉన్న అయిదు శాతం స్లాబ్‌ను రద్దు చేసే ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయంటూ ఇదివరకు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతంగా జీఎస్టీ స్లాబ్స్ ఉన్నాయి. వీటిల్లో మార్పులు చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది.

స్లాబుల మార్పు..
ఈ స్లాబ్స్‌ను పెంచేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. 5 శాతంగా ఉన్న స్లాబ్ స్థానంలో 7 లేదా 8, 18 శాతంగా ఉన్న స్లాబ్‌లో 20 శాతాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఆ శాఖ వద్ద ఉన్నాయని అంటున్నారు. దీనిపై ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయాన్ని ఆర్థికశాఖ తీసుకుంటుందని సమాచారం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications