PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత నిధుల విడుదల ఎప్పుడంటే..
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని 2019లో తీసుకొచ్చారు. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. నాలుగు నెలలకు ఒకసారి అన్నదాతల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 23 విడతలుగా రూ.46 వేలు రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం రైతులందరూ 24వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. జూన్ లో 23వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు అక్టోబర్ లో 24వ విడత నిధులు జమ చేయనున్నారు.
ఈ పథకంలో భాగంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతి ద్వారా ఈ డబ్బు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఈ ఆర్థిక సహాయాన్ని నిరంతరాయంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2031 వరకు పొడిగించాలని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 24వ విడతకు సంబంధించి రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకుంటే.. ఆన్ లైన్ ద్వారా మీ డబ్బులు జమ అయ్యాయో కాదో తెలుసుకోవచ్చు. ఒక వేళ మీ ఖాతాలో డబ్బులు జమ కాకుంటే.. ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోకుంటే. వెంటనే పీఎం కిసాన్ వెబ్ సైట్ కు వెళ్లి ఈకేవైసీ చేసుకోవాలి. లేకుంటే మీసేవ, సీఎస్సీ సెంటర్ కు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేయాలి.

అయితే పీఎం కిసాన్ కింద చెల్లించే రూ.6 వేలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. అయితే రూ.6 వేలను రూ.9 వేలకు పెంచాలని రైతులు నుంచి డిమాండ్ వస్తుంది. ఈ పథకం ప్రవేశపెట్టిన నుంచి రూ.6 వేలే ఇస్తున్నారని.. ఇప్పుడు ఎరువుల ధరలు, కూలీల ధరలు భారీగా పెరిగాయని. పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రూ.6 వేలను రూ.9 వేలకు పెంచాలని కోరుతున్నారు. పీఎం కిసాన్ పథకం రావాలంటే రైతులకు అర్హతలు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు రైతు భరోసా కింద సంవత్సరానికి రూ.12 వేలు జమ చేస్తోంది.
సీజన్ కు ఎకరాకు రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. వర్షాకాలనికి సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ చేశారు. అయితే ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించినప్పటికీ.. ప్రస్తుతానికి ఎకరాకు రూ.6 వేలే చెల్లిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
