Gold Bonds: ఐదేళ్లలో రూ.2 లక్షలను రూ.6.56 లక్షలు చేసిన గోల్డ్ బాండ్స్..!
బంగారం ఎప్పుడైన వెల్త్ ను క్రియేట్ చేసే సంపదగా ఉంది. అందుకే మన పూర్వీకులు తులాల్లో పసిడి కొనుగోలు చేశారు. ఇప్పటికీ కొనుగోలు చేస్తూనే ఉన్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆర్బీఐ గతంలో అవకాశం ఇచ్చింది. సావరిన్ గోల్డ్ బాండ్ల పేరుతో బాండ్లను తీసుకొచ్చింది. సిరీస్ ల వారీగా బాండ్లను తీసుకొచ్చారు. 2021-22 సిరీస్-VI సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి ముందస్తు రిడీమ్ కు అవకాశం ఇచ్చారు. ఐదేళ్ల తర్వాత ముందస్తు రిడీమ్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కో యూనిట్ రిడంప్షన్ ధరను రూ.15,334గా నిర్ణయించింది. ఈ సెప్టెంబర్ 7న ఈ ధరకు బాండ్లను ముందస్తుగా రిడీమ్ చేసుకునే అవకాశం కల్పించారు.
2021-22 సిరీస్-VI సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు వచ్చాయి. సిరీస్-VI సావరిన్ గోల్డ్ బాండ్లని 2021 సెప్టెంబర్ 7న జారీ చేశారు. సాధారణ పెట్టుబడిదారులకు ఇష్యూ ధర గ్రాముకు రూ.4,732 విక్రయించగా.. ఆన్‌లైన్‌లో డిజిటల్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.50 డిస్కౌంట్‌తో రూ.4,682గా కేటాయించారు. ఈ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసినవారికి ఇప్పుడు ముందస్తు రిడంప్షన్ భాగంగా గ్రాము ధర రూ.15,334కి చేరింది. ఆన్‌లైన్‌లో రూ.4,682కు కొనుగోలు చేసినవారికి ఒక్కో యూనిట్‌పై రూ.10,652 లాభం రానుంది. అంటే అసలు పెట్టుబడిపై దాదాపు 227.5 శాతం రాబడి వచ్చింది.

అదే కాకుండా వడ్డీ ఆదాయం కూడా వచ్చింది. 2021లో రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి సుమారుల 42.72 యూనిట్ల సావరిన్ గోల్డ్ బాండ్లని కొనుగోలు చేశారనుకుంటే.. ప్రస్తుత రిడంప్షన్ ధర ప్రకారం ఆ యూనిట్ల విలువ సుమారు రూ.6.56 లక్షలకు చేరుతుంది. అంటే ఐదేళ్లలో బంగారం ధర పెరుగుదల ద్వారా దాదాపు రూ.4.56 లక్షల లాభం వచ్చినట్లు అవుతుంది. సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి వడ్డీ కూడా వస్తుంది.
ఈ బాండ్లపై ఏడాదికి 2.50 శాతం వడ్డీ చెల్లిస్తూ వస్తున్నారు. ఈ వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. కాబట్టి ఐదేళ్లపాటు బాండ్‌ను కొనసాగించినవారికి పై రూ.3.28 లక్షల విలువకు అదనంగా వడ్డీ కూడా వచ్చింది. అయితే ముందస్తు రిడీమ్ చేసుకుంటే ట్యాక్స్ కట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే చాలా మంది రిడీమ్ చేసుకోకపోవచ్చని భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
