ఒక CEO గా నా జీవితాన్ని మార్చిన 5 మధ్య తరగతి విలువలు

పెద్ద సంపదలు లేవు, గొప్ప సౌకర్యాలు లేవు... కానీ కలలు మాత్రం పెద్దవే. ఒక్కో అవకాశం ఒక్కో బంగారంలా భావించే కుటుంబాల్లో పెరిగినవాళ్లే జీవితంలో శ్రమకు అసలైన అర్థాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి జీవితం నుంచి ఎదిగినవారిలో ఒకరు హెల్త్‌కార్ట్ సీఈఓ సమీర్ మహేశ్వరి. తాజాగా ఆయన లింక్డ్ఇన్‌లో రాసిన ఒక హృద్యమైన పోస్ట్ ఇప్పుడు లక్షల మందిని ఆకట్టుకుంటోంది.

Sameer Maheshwari HealthKart CEO middle class life lessons hard work financial values saving gratitude competitive spirit success inspiration LinkedIn post India

"Thank God I was born middle class" అనే వాక్యం ఒక సాధారణ భావంలా అనిపించినా దాని వెనక ఓ జీవితానుభవం, ఎన్నో నేర్చుకున్న పాఠాలు, లోతైన భావోద్వేగాలు దాగున్నాయి. భారతదేశంలో మధ్య తరగతి జీవితం ఆయనపై ఎలా ప్రభావం చూపిందో ఆయన సులభంగా వివరించారు.

సమీర్ మహేశ్వరి తాను మధ్య తరగతిలో పుట్టినవాడిగా గర్వంగా భావిస్తున్నారు. ఆయన మాటల్లోనే "మన వద్ద ఏ వారసత్వ సంపద లేకపోయినా, ఏ ప్రత్యేకమైన అవకాశాలు లేకపోయినా, మనం కష్టపడకపోతే ఎవరూ వెనక నిలవరు" అనే ఈ మాటలు మన దేశంలోని చాలా మధ్య తరగతి కుటుంబాల జీవితాలని ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే చాలా మంది ఇదే పరిస్థితి నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.

సమీర్ మహేశ్వరి భావన ప్రకారం, ఆర్థికంగా తక్కువగా ఉన్నా... మంచి విలువలు, కష్టపడే తపన, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం జీవితానికి నిజమైన బలంగా మారాయి. ఇవి మనకు సహజంగా రాలేవు కృషి చేసి సంపాదించాల్సిన అవసరం ఉండటమే జీవితాన్ని బాగా నేర్పిందని ఆయన అన్నారు.

క్రికెట్ బ్యాట్‌ కోసం నెలలపాటు ఎదురు చూశానని ఆయన ఉదాహరణ ఇచ్చారు. బహుమతి రూపంలో దానిని సంపాదించడం జీవిత పాఠానికి ప్రతీక. "ఏదైనా విలువైనది సాధించాలంటే సంపాదించాలి" అనే భావన తెలిసింది.

మధ్య తరగతి జీవితం నేర్పే అయిదు ప్రధాన పాఠాలు

1. ధనానికి విలువ: ప్రతి రూపాయి విలువైనదే అనే భావన మధ్య తరగతిలోనే నేర్చుకుంటాం. ఎటు పోయినా డబ్బు వృథా కాకుండా జాగ్రత్తగా వినియోగించడం అలవాటు అవుతుంది.

2. అవసరం vs కోరిక: బయట తినడం, ఖరీదైనవి కొనడం అనేవి ఆనందంగా అనిపిస్తాయి కానీ అవసరంగా కాదు. కోరికలకు కాకుండా, అవసరాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే దృష్టికోణం ఏర్పడుతుంది.

3. ముందుగా సేవింగ్స్: ఖర్చు చేసే ముందు పొదుపు తప్పనిసరి.

4. కృతజ్ఞత: లేనిదానిపై బాధపడకుండా, ఉన్నదానిపై సంతృప్తిగా ఉండడం మధ్య తరగతిలో నేర్చుకునే పాఠం.
సాధనతో పొందిన ప్రతి చిన్నది ఒక గొప్ప సంపదగా కనిపిస్తుంది.

5. పోటీ భావన: సహచరులతో పోలిస్తారు, కానీ అది అసూయగా కాకుండా ధైర్యంగా మలచుకోవాలి.

సమీర్ మహేశ్వరి చెప్పినట్టు, మధ్య తరగతి మనస్తత్వం జీవితాంతం నాతో ఉండిపోతుంది. ఎంత ఎదిగినా, ఆ ఆలోచనల నుంచి బయటపడటం కష్టం. "నాకు ఖరీదైన చెప్పులు కొనగలగిన శక్తి ఉన్నా ముందుగా వెబ్‌సైట్స్ చూస్తా, ఆఫర్లు చూస్తా, సరసమైన ధర కోసం వెతుకుతాను. అందుకు ఈ మధ్య తరగతి అలవాట్లు మరచిపోలేను" అని ఆయన చెప్పారు.

కష్టాలు లేకుండా విజయాన్ని ఆస్వాదించడం అసాధ్యం. "త్వరగా, అధికంగా పొందితే ఇదే ఉత్సాహం ఉండేదా?" అనే ఆయన ప్రశ్న ఆలోచించేలా ఉంది. కష్టాలే ఆయనకు ఒక మార్గదిశను చూపించాయి, ఇబ్బందులే జీవితంలో ఆయనను ఎదుర్కొనే ధైర్యాన్ని నేర్పాయి. ఆయన మాటల్లో మధ్య తరగతి అనేది కేవలం ఆర్థిక స్థాయి కాదు, అది ఒక జీవన శైలి. ఈ పోస్ట్‌కు ప్రజల నుంచి అపారమైన స్పందన వస్తుంది. చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు. మధ్య తరగతి జీవితంలో దాగి ఉన్న విలువలు, తీయని కష్టాలు, నిలకడగా ముందుకు సాగే జీవన బాట ఇవన్నీ తిరిగి గుర్తు చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+