ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాను ఏటా ఫోర్బ్స్ పత్రిక ప్రచురిస్తూ ఉంటుంది. వారిలో అధిక శాతం మంది వ్యాపారాలు నిర్వహిస్తూ, సంపదను సృష్టించడానికి ప్రతయత్నిస్తుంటారు. ఈ పనిలో పడి అంతగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడరు. అయితే థాయిలాండ్ రాజు వజిరాలాంగ్ కార్న్ మాత్రం తన సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారట. కేవలం పార్టీల కోసమే 125 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టారని సమాచారం.
దాదాపు 3.2 లక్షల కోట్ల నికర విలువ కలిగిన ఆస్తులు రాజు మహా వజిరాలాంగ్ కార్న్ సొంతం. థాయిలాండ్ చక్రవర్తిగా ఈయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రాజుకి దేశ వ్యాప్తంగా పలు ఆస్తులు, భూములు ఉన్నాయి. వివిధ ప్రభుత్వ భవనాలు, హోటళ్లు, అద్దె వచ్చే ఇళ్లు, రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ భారీగా ఉన్నాయి.

ఇవేగాక బ్యాంకులు, సిమెంట్ కంపెనీల్లో రాజుకి వాటాలు ఉన్నాయి. ఆయన వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన వజ్రంగా గుర్తింపు పొందిన 545.67 క్యారెట్ల బ్రౌన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ ఉంది. దీని విలువ 98 కోట్లు. వీటితో పాటు బోయింగ్, ఎయిర్ బస్, సుఖోయ్ జెట్, 21 హెలీకాఫ్టర్లు, 38 విమానాలు ఆయన సొంతం. వాటికి కేవలం ఇంధనం, మెయింటెనెన్స్ కోసమే ఏడాదికి 524 కోట్లు ఖర్చవుతుందట.
థాయ్‌లాండ్ రాజు కాన్వాయ్ లో లిమోసిన్స్, మెర్సిడెస్ బెంజ్ కార్లతో సహా 300 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నాయి. దీనికి తోడు 52 పడవలతో కూడిన నౌకాదళం రాయల్ బోట్‌తో పాటు ఉంటుంది. అవన్నీ క్లిష్టమైన బంగారు శిల్పాలతో అలంకరించబడి ఉంటాయి. ఇదీ మహా వజిరాలాంగ్ కార్న్ రాజభోగం.


Click it and Unblock the Notifications